Friday, September 12, 2025 05:14 PM
Friday, September 12, 2025 05:14 PM
roots

పుష్ప – 2 టార్గెట్ గా మెగా ఫాన్స్ వ్యూహం

ఏదేమైనా సినిమా వాళ్ళు రాజకీయం చేస్తే మాత్రం చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. రాజకీయ పరమైన అంశాల్లో సినిమా వాళ్ళు దూరి… కాస్త చికాకు చికాకు చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య మొదలైన మాటల యుద్ధం క్రమంగా పెరుగుతోంది. ఇందులో జనసేన నేతలు కూడా ఎంటర్ కావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా వివాదం మారిపోయింది. అయితే ఈ వివాదంలో ఇప్పుడు కాస్త ఆసక్తికర పరిణామాలు కనపడుతున్నాయి.

అల్లు అర్జున్ కోసం వైసీపీ అభిమానులు రంగంలోకి దిగారు. వైసీపీ పెయిడ్ పేజెస్ లో అల్లు అర్జున్ కి మాద్దతుగా కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఇబ్బంది పెడతారని మనం అండగా నిలబడాలి అంటూ పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టారు. ఇక సినిమా పరిశ్రమలో, రాజకీయాల్లో ఒంటరిగా పోరాటం చేసేది ఇద్దరే వ్యక్తులు అని ఒకరు వైఎస్ జగన్ అయితే మరొకరు అల్లు అర్జున్ అని, వారికి కూటమి లేదని సింగిల్ గా నిలబడిన వ్యక్తులు అంటూ పోస్ట్ చేస్తున్నారు.

మన వైసీపీ అభ్యర్ధికి మద్దతుగా నిలబడినందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవడానికి అందరం ముందుకు రావాలని వారు కోరడం విశేషం. ఇక అల్లు అర్జున్ కూడా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పుష్ప 2 సినిమాను ఒకవేళ మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పెడితే ఏం చేయాలనే ప్లాన్ కూడా అల్లు అర్జ్జున్ సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఈ వార్ తీవ్రత ప్రభావం గట్టిగానే పడుతోంది. పలువురు ప్రముఖులు కూడా చల్లబరిచే కార్యక్రమాలు చేస్తున్నట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్