Thursday, September 11, 2025 08:06 PM
Thursday, September 11, 2025 08:06 PM
roots

మెగా ఫ్యామిలీకి గడ్డు కాలమే..?

మెగా ఫ్యామిలీ అనగానే సూపర్ హిట్ సినిమాలు, మాస్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కళ్ళ ముందు కనపడతాయి. దాదాపు పది మంది హీరోలు ఎప్పుడూ ఏదోక సినిమా చేస్తూ, ఎవరో ఒకరు హిట్ కొడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి గడ్డు కాలం నడుస్తోంది. ఏ సినిమా రిలీజ్ చేసినా ఫ్లాప్ అవుతోంది. చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150 యావరేజ్ హిట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఒక్కటే ఆకట్టుకుంది. ఆ సినిమాలో కూడా రవితేజా ఉండటంతో అది మల్టీ స్టారర్ అనే చెప్పాలి.

Also Read : జగన్‌ను మరింత ఇబ్బంది పెడుతున్న..!

ఇక పవన్ కళ్యాణ్ చాన్నాళ్ళ తర్వాత రిలీజ్ చేసిన.. హరిహర వీరమల్లు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. నిర్మాతకు కాస్త లాభాలే వచ్చినా.. సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు రామ్ చరణ్. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ ను నేషనల్ స్టార్ చేయాలనే చిరంజీవి తపన.. అలాగే మిగిలిపోతోందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : హైదరాబాద్ నవాబ్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా..!

మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేసే.. అల్లు అర్జున్, బాలకృష్ణ, ఎన్టీఆర్.. నేషనల్ లెవెల్ లో సక్సెస్ అవుతోంటే.. రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్.. దేవరతో హిట్ కొట్టాడు. వార్ 2 సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ అఖండ సినిమా రిలీజ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, వైష్ణవ తేజ్ ఇలా దాదాపు అందరూ ఫ్లాపులతోనే ఉన్నారు. మరి పాన్ ఇండియా లెవెల్ లో మెగా ఫ్యామిలీ ఎప్పుడు సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్