ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకునే పరిణామాలు కాస్త ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సంచలనంగా మారింది. పెనుకొండలోని అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో దొంగతనం జరిగిందనే వార్త సంచలనం అయింది. కియా కంపెనీలో 900 కారు ఇంజన్లు మాయం అయ్యాయని అక్కడి అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడి భాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తున్నాయి.
Also Read : రాజధాని అమరావతికి మరో బిగ్ న్యూస్..!
దాదాపు 900 కియా కార్ల ఇంజన్లు మాయమైనట్లు గుర్తించిన యాజమాన్యం.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చి 19వ తేదీన పోలీసులకు కియా యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్న పోలీసులు.. పలువురు ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. అయితే తమకేమి సంబంధం లేదని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కియా పరిశ్రమలో పనిచేసి వెళ్లిన ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
Also Read : అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. అసలేం జరిగింది..?
కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజన్ల తరలించే సమయంలో మార్గ మధ్యంలో ఏమైనా చోరీ జరిగిందా?? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. దీని వెనుక స్థానిక వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పలు రాష్ట్రాలు పోటీ పడిన సమయంలో.. ఏపీలో అడుగు పెట్టిన కియా కంపెనీ గత అయిదేళ్ళలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం నుంచి కూడా తరలిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.




