Wednesday, October 22, 2025 03:56 AM
Wednesday, October 22, 2025 03:56 AM
roots

సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతున్నారా…?

మావోయిస్టులు అలిసిపోయారా.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ దెబ్బకు దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపు తుడిచిపెట్టినట్లు అయ్యింది. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. కేంద్ర బలాగాల చేతిల్లో ఇప్పటికే వందల మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులో కీలక నేతలంతా దాదాపు మృతి చెందారు. కొత్త నియామకాలు జరగటం లేదు. మావోయిస్టులకు ఆదరణ కూడా ఆశించిన మేర లేకపోవడంతో.. ఇక సాయుధ పోరాటానికి శుభం పలకాలని భావించినట్లు తెలుస్తోంది.

Also Read : నన్ను వదిలేయండి..జగన్ కు వల్లభనేని షాక్

మావోయిస్టులకు అండగా ఉండే ప్రాంతం దండకారణ్యం. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులు మావోయిస్టులకు షెల్టర్ జోన్. తూర్పు కనుమల ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఇప్పటి వరకు కార్యకలాపాలు సాగించారు. ఏవోబీలో కూబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతుండటంతో మావోయిస్టులు తమ మకాం పూర్తిగా దండకారుణ్యానికి మార్చేశారు. అయిత 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తీశారు.

పైగా ఏజెన్సీ ఏరియాలో అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తోంది కేంద్రం. రహదారులు, రైల్వే మార్గాలు నిర్మిస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందడం లేదు. దీంతో భారీ ఎత్తున మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు కూడా. కీలక నేతలు కూడా ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలో కలుసుతున్నారు. దీంతో కొంతకాలం పాటు ఆయుధాలు విడిచిపెట్టాలని మావోయిస్టు పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మావోయిస్టు అగ్రనేత అభయ్ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని.. ఇందుకు ప్రధానంగా దేశంలో మారుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రస్తావించారు. ఆయుధాలు వదిలిపెట్టాలని కేంద్రం చేస్తున్న విజ్ఞప్తి మేరకు సాయుధ పోరాటం విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖ ద్వారా ప్రకటించారు.

Also Read : మోడీకి ట్రంప్ ఫోన్.. తప్పు దిద్దుకుంటున్న పెద్దన్న..?

సాయుధ పోరాటం విరమణ అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందిన నిర్ణయం కాదని.. దీనిపై ఇతర నేతలతో కూడా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అందుకు కనీసం నెల రోజులు సమయం పడుతుందని.. అప్పటి వరకు కాల్పుల విరమణ కావాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో అమరుడు కాకముందు నుంచే శాంతి చర్చల ప్రస్తావనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు అభయ్, వెల్లడించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్