Tuesday, October 28, 2025 04:20 AM
Tuesday, October 28, 2025 04:20 AM
roots

మనోజ్ ను ఇంత దారుణంగా కొట్టారా…? గోళ్ళతో గీరింది ఎవరు…?

మంచు కుటుంబంలో విభేదాలు నిజమే అని మరోసారి ప్రూవ్ అయింది. తనపై తన తండ్రి మోహన్ బాబు దాడి చేసినట్టు పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇది అబద్దం అని, కావాలనే మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంచు కుటుంబం నుంచి ఓ ప్రకటన వచ్చినా అది నిజం కాదని తేలిపోయింది. మంచు మనోజ్ ఆస్పత్రికి వెళ్ళడం, దాడి నిజమే, పోలీసులకు ఫిర్యాదు చేసింది నిజమే అని పోలీసులు క్లారిటీ ఇవ్వడం వంటివి జనాలకు క్లారిటీ వచ్చేసింది.

Also Read : క్లోజ్ ఫ్రెండ్స్ ను నిండా ముంచిన కొడాలి

ఇక మనోజ్ ఆస్పత్రికి వెళ్ళగా అక్కడ అతని శరీరంపై ఉన్న తీవ్ర గాయాలు చూసి వైద్యులు షాక్ అయ్యారు. బంజారాహిల్స్‌ TX హాస్పిటల్‌ నుంచి మంచు మనోజ్‌ డిశ్చార్జ్‌ అయ్యాడు నిన్న సాయంత్రమే. నేడు మరోసారి TX ఆస్పత్రికి రానున్న మంచు మనోజ్‌… మరిన్ని పరిక్షలు చేయించుకునే అవకాశం ఉంది. మంచు మనోజ్‌పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు హాస్పిటల్‌ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. ఇక రిపోర్ట్ ను పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

Also Read : ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే నాథుడే కరువు…!

ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే సిటీ స్కాన్‌, అల్ట్రాసౌండ్‌ ఎక్స్‌రే పరీక్షలు చేసిన వైద్యులు… మనోజ్ మెడపై గోళ్ళతో చేసిన గాయాలు ఉన్నాయని గుర్తించారు. మనోజ్ వీపుపై మహిళల తరహాలో గోళ్ళతో గీరినట్టు గాయాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చారు వైద్యులు. అలాగే వెన్నుముఖ, మెడ, తల, అరికాళ్ళపై మనోజ్ కు గాయాలు ఉన్నట్టు వెల్లడి అయింది. దీనితో మంచు మనోజ్‌ ఇంటికి వెళ్లి పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనున్నారు. ఇక మనోజ్ ఇంటి వద్ద సీసీ టీవీ ఫూటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ కూడా మంచు విష్ణు… బిజినెస్ పార్టనర్ స్వాధీనం చేసుకున్నట్టు గుర్తించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్