తెలుగు సినీ పరిశ్రమ నుంచి మొదలైన ప్రయాణం.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌కు చేరింది. ఇద్దరు ఇద్దరే అనే టైటిల్ ఇప్పుడు ఆ ఇద్దరికీ సరిగ్గా సరిపోతుంది కూడా. వారే ఒకరు ప్రముఖ దర్శకులు రాజమౌళి, మరొకరు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా #SSMB29. నిజానిగి ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ దక్కించుకున్నారు. బాహుబలితో హాలీవుడ్‌లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు జక్కన్న. అలాంటి జక్కన్నతో ప్రిన్స్ మహేష్ కాంబినేషన్ అంటే.. అది మామూలుగా ఉండదు. పైగా ఈ సినిమాకు గతంలో ఎన్నడూ లేనట్లుగా ఏకంగా 135 మిలియన్ డాలర్లు.. అంటే అక్షరాల రూ.1,188 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కాదు కదా.. కనీసం వర్కింగ్ స్టిల్స్ కూడా రావడం లేదనేది మహేష్ అభిమానుల ఆవేదన.
Also Read : ఆసుపత్రిలో రేణు దేశాయ్..!
ప్రిన్స్ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అటు ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమా కావడంతో.. ఈ కాంబో ఎలా ఉంటుందా అనే సినీ పరిశ్రమ మొత్తం ఆత్రంగా ఎదురు చూస్తోంది. ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో నటిస్తున్నారనే విషయం తప్ప.. సినిమాలో నటీనటులెవరో కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ అని.. ఈ చిత్రం షూటింగ్ వివిధ ప్రదేశాలలో జరుగుతోందని మాత్రమే బయటకు తెలిసిన విషయం. మహేశ్ మెడలో ఓ లాకెట్ వేసుకున్న ఫోటో తప్ప.. ఇప్పటి వరకు ఎలాంటి వర్కింగ్ స్టిల్స్ లీక్ అవ్వలేదు. తన సినిమా గురించి జక్కన్న ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సినిమా టైటిల్ కూడా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. నిజానికి ఆర్ఆర్ఆర్ గురించి అయితే ముందే కథంతా చెప్పేశారు జక్కన్న. కానీ మహేష్ సినిమా గురించి కనీసం ఒక్క లీక్ కూడా లేదు.
Also Read : సమంత–రాజ్ నిడిమోరు లవ్ స్టోరీ నిజమా?
తాజాగా #SSMB29 గురించి బిగ్ అప్ డేట్ అంటూ సోషల్ మీడియాలో, అటు ఫిలింనగర్‌లో ఓ న్యూస్ తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ గురించి రివీల్ చేసే సమయం ఆసన్నమైందనే మాట వినిపిస్తోంది. నవంబర్ 11 నుంచి 15వ తేదీ మధ్య హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. సినిమా షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి అయ్యిందనే మాట వినిపిస్తోంది. సినిమాను ప్రముఖ హాలీవుడ్ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. వారికి 3 నెలల ముందే సినిమా పూర్తిగా అప్పగించాల్సి ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్ పూర్తి చేసిన జక్కన్న.. ఇప్పుడు సినిమాలో నటించిన తారాగణంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు వారణాసి అనే పేరు పెట్టినట్లు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. నవంబర్ 15వ తేదీ లోపు సినిమా పేరుతో పాటు గ్లింప్స్ కూడా వస్తుందంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. దీంతో #SSMB29 పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.