పార్లమెంట్ సమావేశాలలో తొలిరోజు ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి విషయంలో అధికార ఎన్డీఏ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో ఎన్నో పేర్లు ఇప్పటివరకు చర్చకు వచ్చినా చివరకు మహారాష్ట్ర గవర్నర్ ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసింది. సిపి రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతి కానున్నారు. పార్లమెంట్ లో ఎన్డీఏకి పూర్తి బలం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఇక ప్రతిపక్షాల నుంచి ఎవరిని ఎంపిక చేస్తారు అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : ‘వార్ 2’ లో ఎన్టీఆర్ విలనిజం పండలేదా..?
అయితే రాధాకృష్ణన్ ఎంపిక వెనక ఓ కీలక వ్యూహం ఉందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు అవకాశం కల్పించాలని కేంద్రం భావించినట్లు సమాచారం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన తమిళనాడులో పుట్టి పెరిగారు. తమిళ ప్రజల మెప్పుకోసం బిజెపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ పక్షాల నుంచి కూడా పూర్తిస్థాయిలో మద్దతు రావడంతో ఈ విషయంలో కేంద్రం వెనకడుగు వేయలేదు. ముందు ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ కీలక వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
Also Read : జామ ఆకు టీ.. షుగర్ ను కంట్రోల్ చేస్తుందా..?
శేషాద్రి చారిని ఎంపిక చేయవచ్చు అంటూ వార్తలు వచ్చాయి. ఆయన కూడా తమిళనాడు నేపథ్యం ఉన్న వ్యక్తి. అయితే రాధాకృష్ణన్ ఎంపిక తమిళనాడులో బిజెపికి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. ముందు నుంచి బిజెపి విషయంలో తీవ్ర వ్యతిరేకతతో ఉండే తమిళనాడు ప్రజలు.. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అన్నా డీఎంకే పార్టీని బిజెపి బ్రష్టు పట్టించింది అనే కోపం కూడా తమిళ ప్రజల్లో ఉందనేది వాస్తవం.
తమిళ సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తమిళ ప్రజలు.. హిందీ ఆధిపత్యాన్ని స్వాగతించే పరిస్థితి ఉండదు. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా జాగ్రత్తగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. హిందీ భాష విషయంలో కేంద్రాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతూ విద్యావ్యవస్థలో కూడా మార్పులకు శ్రీకారం చుట్టారు. కాబట్టి బిజెపి.. కరుణానిధి కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసినా సరే తమిళనాడు ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదనేది అక్కడి ప్రజల మాట.