Tuesday, October 28, 2025 05:10 AM
Tuesday, October 28, 2025 05:10 AM
roots

పవన్ ఫ్యాన్స్ కు మళ్ళీ షాక్ తప్పదా…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫ్యాన్స్ గట్టిగానే ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో, ప్రభుత్వంలో బిజీగా ఉండటంతో ఆయన సినిమాలకు సమయం కేటాయించలేని పరిస్థితి ఉంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన సినిమాలు కూడా ఇప్పటివరకు ముందుకు వెళ్ళలేదు. ఇక లేటెస్ట్ గా హరిహర వీరమల్లు సినిమా మార్చి నెలలో విడుదలవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇప్పుడు మళ్ళి వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి.

Also Read : అఖిల్ కోసం.. పూరి స్టోరీ రెడీ.. నాగార్జున నమ్మకం అదే..?

మార్చి నెలలో విడుదల చేయడం కష్టమని.. జూన్ లేదా జూలై నెలలో సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. చారిత్రక కధతో వస్తున్న ఈ సినిమా.. రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ తొలి పార్ట్ ఇప్పటికే దాదాపుగా కంప్లీట్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ పై ఒ కీలక సన్నివేశాన్ని రాజస్థాన్లో షూట్ చేయాల్సి ఉంది. దానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : సినిమాల్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. స్టోరీ లైన్ కూడా చెప్పేశారు…!

దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా దాదాపుగా వాయిదా పడే అవకాశాలే ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ముందు ఆ సన్నివేశం లేకుండా సినిమాను రిలీజ్ చేయాలని భావించినా.. ఆ కీలక సన్నివేశానికి అధిక ప్రాధాన్యత ఉండటంతో, అది లేకుండా రిలీజ్ చేయొద్దని భావిస్తున్నారట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మార్చి 28 అనుకున్న ఈ సినిమా మే నెలలో లేదంటే జూన్ నెలలో ఖచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ మరో 12 రోజులు ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సి ఉంది. రాజస్థాన్లోనే దాదాపుగా ఐదు రోజులపాటు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ సైన్ చేశారు. ఆ సినిమాలు కూడా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్