ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అనూహ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం అనంతపురం పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఉన్నపళంగా అనంతపురం పర్యటనను ముగించారు. పలు అధికారిక కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొనాల్సి ఉంది. అనూహ్యంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో లోకేష్ ఢిల్లీ బయలుదేరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో కొన్ని అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి.
Also Read : టీడీపీ రూట్ మ్యాప్.. మహానాడులో అన్నీ సంచలనాలే
అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో కీలక వ్యక్తులను అరెస్టు చేసే దిశగా అడుగులు వేస్తోంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన అధికారులు త్వరలోనే మరి కొంతమంది కీలక వ్యక్తులపై కూడా గురిపెట్టే అవకాశం స్పష్టంగా ఉంది. దీనితో ఏం జరగబోతుంది అనేది వైసీపీలో కాస్త ఆందోళన రేపుతోంది.. ఇక జగన్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఐఫోన్ లో సంభాషణలు జరిపారనే వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది.
Also Read : నేతల రాజీనామాల వెనుక కారణమదే..!
ఈ సమయంలో లోకేష్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సమయంలో వ్యక్తిగతంగా వచ్చి తనను కలవమని కోరారు. ఇటీవల అమరావతి పనుల ప్రారంభానికి వచ్చిన మోడీ మరోసారి లోకేష్ న్యూఢిల్లీ రావాలని ఆహ్వానించడం. దీనితో లోకేష్ కార్యాలయం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. వాస్తవానికి వచ్చే వారం లోకేష్ ఢిల్లీ వెళ్తారనే వార్త ప్రభుత్వ వర్గాల్లో వినబడింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ వెళ్లడం, మద్యం కుంభకోణంలో అధికారులు దూకుడుగా ఉండడం ఏ పరిణామాలకు దారితీస్తుందా అనేది కీలకంగా మారింది.