Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

లోకేష్ ట్వీట్‌తో టీడీపీ కార్యకర్తలు హర్ట్ అయ్యారా..?

ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా, కార్యకర్తలు అయినా సరే కొన్ని విషయాలను కాస్త వ్యక్తిగతంగా తీసుకుంటారు. అందుకే రాజకీయ నాయకులు కూడా మనోభావాలకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కార్యకర్తల ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వకపోతే రాజకీయ మనుగడ కూడా కష్టమే. ముఖ్యంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ఐదేళ్లుగా ఎదురైన అనుభవాలతో పార్టీ విషయంలో సీరియస్ గా ఉన్నారు. నాయకులు ఏం చేసినా సరే దానిని చాలా సున్నితంగా తీసుకుంటున్నారు.

Also Read : జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ.. బీ అలర్ట్..!

తాజాగా సోషల్ మీడియాలో నారా లోకేష్ చేసిన పోస్ట్ విమర్శలకు దారితీసింది. ముల్లును ముల్లుతోనే తీయాలి కానీ ముళ్ళు మీద ప్రేమ చూపించడం కరెక్ట్ కాదంటూ కొంతమంది మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి పలువురు సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక దీనికి కూడా నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో రియాక్ట్ అయ్యారు.

Also Read : టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ఇల్లు గుర్తించిన నేషనల్ మీడియా

కేటీఆర్ త్వరగా కోలుకోవాలని.. విశ్రాంతి తీసుకోవాలంటూ సానుభూతి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు మంత్రి. ఈ పోస్ట్ చూసిన టిడిపి కార్యకర్తలకు ఎక్కడో మండింది. చంద్రబాబును అరెస్టు చేస్తే కేటీఆర్ వెటకారంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయాన్ని లోకేష్ ఎలా మర్చిపోతారని మండిపడుతున్నారు కార్యకర్తలు. చంద్రబాబు పై వెటకారపు పోస్ట్ చేసినందుకు తమకు కోపం వస్తున్నా.. పార్టీ నాయకులకు ఎందుకు రావడం లేదంటూ మండిపడుతున్నారు. తమ మనోభావాలకు విలువ లేదా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో మంత్రిపై నేరుగా విమర్శలకు దిగారు. గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ ఇటీవల చంద్రబాబుపై విమర్శలు చేసిన సందర్భం కూడా ఉంది. మరి ఇవన్నీ మర్చిపోయి లోకేష్ ఆప్తులు అనే పదాన్ని ఏ విధంగా వాడుతారు అంటూ మండిపడుతున్నారు కార్యకర్తలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్