Friday, September 12, 2025 02:39 PM
Friday, September 12, 2025 02:39 PM
roots

లోకేష్ రివేంజ్ అదుర్స్, వైసీపీ జర్నలిస్ట్ ప్రశంసలు

2021 కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు చూస్తే.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇమేజ్ తగ్గించేందుకు వైసిపి ఏ స్థాయిలో కష్టపడిందో అర్థమవుతుంది. కనీసం నామినేషన్ కూడా వేయనీకుండా టిడిపి కార్యకర్తలను బెదిరించిన సందర్భాలు కూడా అప్పట్లో చూసాం. 14వ వార్డు అభ్యర్థి నామినేషన్ ను ఫోర్జరీ సంతకంతో విత్ డ్రా చేయించడం వివాదాస్పదమైంది. ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం కూడా ప్రకటించడం పై టిడిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై టిడిపి నేతలు నిమ్మల రామానాయుడు, అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని వంటివాళ్లు నిరసనకు కూడా దిగారు.

Also Read : మోడీకి వెంకయ్యే పెద్ద దిక్కయ్యారా..?

గ్రామపంచాయతీగా ఉన్న కుప్పంను స్థానికంగా ఉన్న ఏడు గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చి ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు వారిని నిలబెట్టి గెలిపించారు. ఇక ఇప్పుడు పులివెందుల విషయానికొస్తే.. జడ్పిటిసి ఎన్నికలను సీరియస్ గా తీసుకుని టిడిపి రాజకీయం చేసింది. అయితే ఈ విషయంలో రాజకీయ పరిశీలకులు, టిడిపి కార్యకర్తలు మంత్రి లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2021లో తన తండ్రికి జరిగిన అవమానానికి లోకేష్ ఇలా ప్రతీకారం తీర్చుకున్నారంటూ కొనియాడుతున్నారు. వైసిపి తెర లేపిన సాంప్రదాయానికి.. లోకేష్ అదిరిపోయే రిప్లై ఇచ్చారని టిడిపి కార్యకర్తలు అభినందిస్తున్నారు.

Also Read : మోడీ రాజీనామా చేయాల్సిందే..? పట్టుబడుతున్న ఆర్ఎస్ఎస్..?

వైసీపీకి అనుకూలంగా మాట్లాడే జర్నలిస్టులు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో లోకేష్ పై.. ప్రశంసలు కురిపించడం షాకింగ్ విషయం. పులివెందులలో జరిగింది తప్పు అయితే కుప్పం నియోజకవర్గంలో కూడా 2021లో వైసీపీ చేసింది తప్పేనని.. రాజకీయాల్లో అనైతికమని మాట్లాడే ముందు చరిత్ర కూడా గుర్తుంచుకోవాలంటూ ఓ జర్నలిస్టు తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో పోస్ట్ చేశారు. కుప్పం నియోజకవర్గంలో పోలీసులను అడ్డం పెట్టుకుని వైసిపి అప్పుడు చేసిన రాజకీయాన్ని మర్చిపోవద్దని.. అది గుర్తుపెట్టుకునే లోకేష్ తెరవ వెనుక రాజకీయం నడిపించారని.. సదరు జర్నలిస్ట్ కామెంట్ చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్