ఏపీ మంత్రి నారా లోకేష్ దూకుడు ఇప్పుడు టీడీపీ నేతలను ఆశ్చర్య పరుస్తుంది. గతంలో ఎన్నో విమర్శకులు ఎదుర్కొన్న లోకేష్, ఇప్పుడు పని చేస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో సైతం చర్చనీయంశంగా మారింది అనే చెప్పాలి. నాకు కష్టం ఉందని లోకేష్ కు చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుందనే స్థాయిలో లోకేష్ పని తీరు ఉండటం అధికారులని కూడా ఆశ్చర్యపరుస్తుంది. వికలాంగుల సమస్య పరిష్కారం నుంచి నిన్న ఒక విద్యార్ధి ఫీజు వరకు కూడా లోకేష్ పని తీరు ప్రజలను చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఎవరితో సంబంధం లేకుండా లోకేష్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
గతంలో లోకేష్ మంత్రిగా పని చేసిన దాని కంటే ఇప్పుడు మరింత దూకుడుగా ఆయన పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్వయంగా తానే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి ప్రజలతో ఆయన నేరుగా టచ్ లో ఉంటున్నారు. ప్రజలకు మరింత దగ్గర కావాలనే లక్ష్యంతో పని చేస్తున్న మంత్రి… నియోజకవర్గ సమస్యలే కాకుండా రాష్ట్ర వ్యాప్త సమస్యల మీద కూడా దృష్టి పెడుతున్నారు. విద్యా శాఖలో ఉన్న లోపాలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలోనే ఆయన విద్యార్ధుల కోసం కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టే దిశగా అడుగులు వేయనున్నారు. ఇది తన నియోజకవర్గం నుంచి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. మండలాల వారీగా ప్రతిభ కలిగిన విద్యార్ధులను కేవలం చదువులోనే కాకుండా క్రీడా, సాంకేతిక రంగాల్లో కూడా ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వాళ్ళ లిస్టు కూడా సేకరించి వారిలో ప్రతిభ కలిగిన వారిని స్కూల్స్ వారీగా గుర్తించి ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం అందించే ప్రయత్నాలు లోకేష్ చేస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తు యువతకు మరింత దగ్గర కావొచ్చని లోకేష్ భావిస్తున్నారు.