Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేర్చనున్న లోకేష్

మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి నిర్మాణం. తనను 91వేల భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపడంతో మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కలను నెరవేర్చేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధమయ్యారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్ గా ఆసుపత్రి నిలిచేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

Also Read : ఏపీ రైల్వేలో కీలక అడుగు

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా, దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవన నమూనాలు, ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కల్పన విషయంలో పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా చూడాలన్నారు. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని గడువు విధించారు.

Also Read : సజ్జలకు జగన్ బిగ్ షాక్.. మరో రెడ్డికి అగ్ర తాంబూలం

చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రికి కేటాయించిన 7.35 ఎకరాల్లో 1,15,000 చదరపు అడుగుల్లో అత్యంత విశాలంగా ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు. వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధికి రూ.52.20 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం జీ ప్లస్ వన్ విధానంలో ఆసుపత్రిని నిర్మిస్తుండగా భవిష్యత్ లో విస్తరించుకునే అవకాశం ఉంది. ఆసుపత్రిలో మెడికల్, సర్జికల్, ఆర్థో, గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ విభాగాలను ఏర్పాటుచేయనున్నారు. వీటితో పాటు 3 ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ సెంటర్, మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు తలసేమియా వార్డు, డీ అడిక్షన్ ఓపీ సెంటర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read : వైసీపీకి జీవం పోస్తున్న టీడీపీ నేతలు.. ఇలా అయితే ఎలా..?

యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది అక్టోబర్ 23వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో మంగళగిరి ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారితో అంతగా కొట్లాడి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో నారా లోకేష్ పేర్కొన్నారు. అన్నట్లుగా రాష్ట్రంలోనే మూడో భారీ మెజార్టీ సాధించడంతో మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు.

Also Read : HCU భూముల్లో కీలక పరిణామం, రేవంత్ కు షాక్ తప్పదా..?

1986లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ మంగళగిరిలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. కాలక్రమేణా ఆసుపత్రి నిరాదరణకు గురికావడంతో కేవలం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. అనేక సంవత్సరాలుగా మంగళగిరి ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచాలంటూ ప్రజలు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి డిమాండ్ చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఎంతోమంది పాలకులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేదు. మంత్రి నారా లోకేష్ రాకతో ఆసుపత్రి కల సాకారం కానుంది. మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం శిథిలం కావడం, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాలను చినకాకానికి మార్చి వైవీసీ క్యాన్సర్ ఆసుపత్రి స్థలాన్ని కేటాయించడం జరిగింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్