Saturday, October 18, 2025 07:01 PM
Saturday, October 18, 2025 07:01 PM
roots

గ్రేటర్ బెజవాడ కొత్త లెక్క.. మొత్తం 75 గ్రామాలతో.. మండలాలు ఇవే

విజయవాడ నగర అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. విజయవాడ నగరం ఇరుకుగా ఉండటం, అభివృద్ధికి ఇబ్బందిగా మారడంతో చుట్టుపక్కల గ్రామాలలో నగరంలో కలపాలని నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కృష్ణా జిల్లాలో మొత్తం 75 గ్రామాలను విజయవాడ నగరంలో విలీనం చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. మైలవరం, గన్నవరం, పెనమలూరు మండలాల్లోని గ్రామాలను విజయవాడలో కలపాలని నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. దాదాపు 500 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : విశాఖను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసిన తండ్రి కొడుకులు

గతంలో గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు పడిన ముందుకు వెళ్లలేదు. అప్పట్లో 45 గ్రామాలను విజయవాడలో విలీనం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్ళగా.. ముందుకు అడుగు పడలేదు. ప్రస్తుతం 61.88 చదరపు కిలోమీటర్ల పరిధిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. గతంలో 45 గ్రామాలను కలపాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు మరో 30 గ్రామాలను కలపడం ద్వారా 500 చదరపు కిలోమీటర్ల పైబడి గ్రేటర్ విజయవాడ పరిధిని పెంచేందుకు అడుగులు వేస్తోంది. కానూరు నుంచి పోరంకి, తాడిగడప, యనమలకుదురు, గంగూరు, గోసాల సహా మొత్తం 75 గ్రామాలను కలపనున్నారు.

Also Read : ఏపీ మందు బాబులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా సరికొత్త ఆదేశాలు

ఇక విజయవాడ – హైదరాబాద్ రూట్ లో.. విద్యాధరపురం, గొల్లపూడి మొదలుకుని ఇబ్రహీంపట్నం వరకు విజయవాడ నగరంలో కలిపే అవకాశం కనబడుతోంది. గన్నవరం మండలంలోని బీబీ గూడెం, చిన్న అవుటుపల్లి, అల్లాపురం, నున్న సహా పలు గ్రామాలు విజయవాడ పరిధిలో కలుస్తాయి. ఇక గ్రేటర్ విజయవాడ సరికొత్త ప్రతిపాదనలో.. కొండపల్లి, తాడిగడప మున్సిపాలిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. పెనమలూరు, ఇబ్రహీంపట్నం మండలాలు పూర్తిస్థాయిలో ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ రెండు మున్సిపాలిటీలు రద్దయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరు నెలల్లోపు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్