ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఇప్పుడు వైసీపీ నేతలకు కూడా లింక్ ఉన్నట్టు తెలంగాణా ఏసీబీ అధికారులు గుర్తించారు. గ్రీన్ కో సంస్థ అధినేత, వైసీపీ అధినేత చలమలసెట్టి సునీల్ కు కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందని తేల్చేసారు. ఈ సంస్థ తన సబ్సిడరీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని తేల్చారు. అదే విధంగా ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్‌లో స్పాన్సర్ గా వ్యవహరించారు. ఓ సబ్సిడరీ కంపెనీ తరపున ఈ స్పాన్సర్ షిప్ చేసింది గ్రీన్ కో.
Also Read : వారికి పదవులు లేవు.. లోకేష్ క్లారిటీ..!
అయితే తాము డబ్బులు ఖర్చు చేయడంతో లాభం లేదని గుర్తించి.. రెండో ఏడాది స్పాన్సర్ షిప్ క్యాన్సిల్ చేసుకుంది. ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించింది గ్రీన్ కో. బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడంతో.. ఆ ఒప్పందం క్యాన్సిల్ కావడంతో.. దాన్ని భరించేందుకు తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 200 కోట్లకు పైగా ఈ రేసు కోసం ఖర్చు చేయడానికి తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ముందుగా రూ. 55 కోట్లు చెల్లించేసారు. కాని అనుమతులు లేకుండానే చెల్లించారు.
Also Read : సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్..!
ఇక గ్రీన్ కో ఎవరిది అని ఆరా తీస్తే… వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ కుటుంబానిది అని తేలింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న ఈ సంస్థ… తెలంగాణాలో గులాబీ పార్టీ ఉన్నప్పుడు వ్యాపారాన్ని బాగా విస్తరించింది. వైసీపీ హయాంలో కూడా తన డామినేషన్ చూపించింది. చలమలశెట్టి సునీల్ సోదరుడు అనిల్ గ్రీన్ కో వ్యాపారాలు అన్నీ చూస్తూ ఉంటాడు. టాలీవుడ్ పెద్దలతో కూడా ఆయనకు లింకులు ఉన్నాయి. టాలీవుడ్ పెద్ద హీరోలను ప్రత్యేక విమానాల్లో మాల్దీవ్స్ కూడా తీసుకుని వెళ్ళారు.