Sunday, October 19, 2025 03:08 PM
Sunday, October 19, 2025 03:08 PM
roots

పవన్‌కు ట్రాక్ క్లియర్.. బ్రేక్ లేనట్లే..!

పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా. ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేసినట్లు ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు కూడా. ఈ సినిమా 2023లో ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీన సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు కూడా. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Also Read : టీం ఇండియా కొత్త స్పాన్సర్ ఎవరంటే..?

ఓజీ సినిమా కోసమే అఖండ 2 వాయిదా వేశారనే మాట ఇప్పటికే టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. సినిమా కలెక్షన్లపై ప్రభావం పడకుండా.. థియేటర్ల సమస్య రాకుండా రెండు సినిమాల దర్శక నిర్మాతలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారనేది బహిరంగ రహస్యం. ఇక సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను కూడా నిర్మాతలు గ్రాండ్‌గానే ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన విశాఖలో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా.

Also Read : ప్రజలు మారాలి.. కలెక్టర్లకు చంద్రబాబు డెడ్ లైన్ 

ఇక పవన్ ఓజీ సినిమాకు ఇప్పుడు లైన్ క్లియర్‌గా ఉంది. అలాగే పవన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని థియేటర్ల మెనేజ్‌మెంట్ కూడా ఓజీ సినిమాకు స్పందన బాగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. ఈ నెలలోనే లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కిందకాండ సినిమాలు సూపర్ హిట్ టాక్‌తో రన్నింగ్ అవుతున్నాయి. ఇదే ఊపులో ఓజీ చూసేందుకు కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు వస్తారని ఆశిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్