Tuesday, October 28, 2025 02:23 AM
Tuesday, October 28, 2025 02:23 AM
roots

మూడో చాప్టర్ లో ఉన్న నాయకులు వీళ్లేనా…?

“రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయింది.. రెండోది ఓపెన్ అయింది.. మూడో చాప్టర్ గురించి రాము, వెంకట్రావుని అడగండి..” అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్ ఇది. మూడో చాప్టర్ త్వరలోనే ఓపెన్ కాబోతుంది అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేసారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం అవుతున్నాయి. రెడ్ బుక్ రెండు చాప్టర్లు అంటే… ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారుల విషయంలో చర్యలు.. తర్వాత నందిగం సురేష్, బోరుగడ్డ వంటి వాళ్ళపై చర్యలు వంటివి జరిగాయి.

అలాగే మద్యం పాలసీలో, గనుల శాఖలో అక్రమాలను కూడా బయటకు లాగారు. ఇప్పుడు మూడో చాప్టర్ లో ఎవరి వంతు వస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి టీడీపీ క్యాడర్ కొన్ని అరెస్ట్ ల గురించి చాలా ఆశగా ఎదురు చూస్తోంది. అందులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రులు కొడాలి నానీ, పేర్ని నానీ, అనీల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వంటి వారి అరెస్ట్ ల గురించి టిడిపి క్యాడర్ ఎదురు చూస్తోంది. వీరిని ఇంకా ఎందుకు బయట ఉంచుతున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు.

Also Read : నీకో నీతి… నాకో నీతి… ఇదే రాజనీతి…!

లోకేష్ తాజా కామెంట్స్ లో గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. అంటే కొడాలి నానీ, వంశీలను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దమై ఉండవచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వల్లభనేని వంశీ… విజయవాడ సివిల్ కోర్ట్ కు హాజరైన సమయంలో భారీగా పోలీసులు మొహరించారు. తనపై దాడి జరుగుతుందేమో అనే భయంతో తన అనుచరులను లాయర్ వేషంలో కోర్ట్ కు తీసుకొచ్చారు వంశీ. ఈ పరిణామాల మధ్యలో లోకేష్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిందని త్వరలోనే కొన్ని సంచలన అరెస్ట్ లు ఉండవచ్చని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్