ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా వర్గాలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అవినీతి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు కథనాలను ప్రచురిస్తూనే ఉన్నారు. సాక్షాలతో వాస్తవాలను బయట పెట్టడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే తరుణంలో.. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పెద్దిరెడ్డి ఘాటుగానే కౌంటర్ లు ఇస్తూ సవాళ్లు కూడా చేస్తున్నారు.
Also Read : కొడితే మామూలుగా ఉండదు.. రేవంత్ కి కేసీఆర్ హెచ్చరిక
అయితే పెద్దిరెడ్డి విషయంలో చిత్తూరు జిల్లా నేతలు పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయటం లేదు. కనీసం ఆయన సొంత నియోజకవర్గం నుంచి కూడా మద్దతు రావడం లేదు. అటు సోషల్ మీడియాలో కూడా వైసీపీ నేతలు పెద్దిరెడ్డికి మద్దతుగా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. వాళ్ళు ఎవరూ ఆయనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం గాని పెద్దిరెడ్డి మద్దతుగా నిలబడే ప్రయత్నం కానీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read : జగన్.. ఈ సారి కూడా మడమ తిప్పుతున్నాడా..?
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దిరెడ్డి ఆధిపత్యం చెలాయించారు. చాలామంది జిల్లా నాయకులను ఇబ్బందులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే టైంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా పెద్దిరెడ్డి కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఆమె కూడా పెద్దిరెడ్డి విషయంలో సీరియస్ గానే ఉన్నారు. గతంలో మదనపల్లి ఫైల్స్ సమయంలో కూడా పెద్దగా వైసీపీ నేతలు పెద్దిరెడ్డికి మద్దతుగా బయటకు రాలేదు. కనీసం వైసీపీ అగ్ర నాయకత్వం కూడా పెద్దిరెడ్డి పై వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.