గత రెండు మూడు నెలల నుంచి కాకినాడ పోర్ట్ వ్యవహారం సెన్సేషనల్ అవుతోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు వాటాల విషయంలో 2019 తర్వాత వైసీపీ వ్యవహరించిన దూకుడు తీవ్ర వివాదాస్పదమైంది. కె.వి. రావు నుంచి అరబిందో సంస్థ వాటాలు లాక్కున్న వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. దాదాపు 3609 కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలను బలవంతంగా లాక్కున్నారని ఆరోపణలు వినిపించాయి. ఇక ఈ వ్యవహారంలో కేవీరావు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో సిఐడి అలాగే ఈడి అధికారులు వేగం పెంచారు.
Also Read : వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రైతుబంధు దందా
అటు సిబిఐ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది అనే ప్రచారం జరిగింది. ఈ తరుణంలో కాకినాడ పోర్ట్ లో వాటాలను తిరిగి కెవి రావుకు అప్పగించేందుకు అరబిందో సంస్థ అంగీకారం తెలిపింది. 2500 కోట్ల విలువైన వాటాలను కేవలం 494 కోట్లకు లాక్కున్నారని కాకినాడ సైజ్ లోని 1109 కోట్ల విలువైన వాటాలను కేవలం 12 కోట్లకు బలవంతంగా లాక్కున్నారని కేవీరావు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సిఐడి అలాగే జాతీయ దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టి విజయసాయిరెడ్డిని అలాగే ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డిని విచారించాయి.
ఆ తర్వాత నుంచి విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోయారు. పరిస్థితి తన చేయి దాటిపోవడంతో విజయసాయిరెడ్డి.. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాతో పాటుగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కాకినాడ పోర్టు వ్యవహారమే కారణమనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఈ వ్యవహారంలో కేవీరావు సిఐడి అధికారులతో పాటుగా ఈడీ అధికారులకు సమర్పించిన కొన్ని ఆధారాల్లో విజయసాయిరెడ్డి అడ్డంగా దొరికిపోయినట్లు సమాచారం. వాటి ఆధారంగానే విజయసాయిరెడ్డి పై కేసులు కూడా నమోదు అయినట్టు తెలుస్తోంది.
Also Read : జరిగిందిదే.. ఐటీ రైడ్స్ పై దిల్ రాజు వ్యాఖ్యలు..!
కాకినాడ పోర్ట్ లో అరబిందో సంస్థ చేసిన కొన్ని అక్రమాలకు సంబంధించి కెవి రావు సాక్షాలను సమర్పించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే విజయసాయిరెడ్డి రాజీకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పించే విధంగా ప్రోత్సహించింది అనే ప్రచారం ఉంది. అల్లుడ్ని కాపాడుకోవడం కోసమే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.