Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

కుప్పం వైసీపీ కొప్పు ఊడుతుందా…?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో.. ఎమ్మెల్సీ భరత్ ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టాలని అప్పట్లో వైసీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నియోజకవర్గంలో పెత్తనం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. చిత్తూరు జిల్లా నాయకులు కూడా కొంతమంది కుప్పం నియోజకవర్గంలో… వైసీపీకి అనుకూలంగా లేని వారి ఓటు హక్కును కూడా తొలగించారు అనే ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి.

Also Read  : అప్పుడు అలా అన్నారు.. మరి ఇప్పుడేమంటారు..?

ఇక ఈ నియోజకవర్గం విషయంలో భరత్ ను అన్ని విధాలుగా అప్పట్లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రోత్సహించారు. భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ ఆయన చేసిన కామెంట్.. అప్పట్లో సెన్సేషన్. చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా… భరత్ గెలుస్తే మంత్రి మాత్రమే అంటూ కొంతమంది సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేశారు. అలాంటి భరత్ ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read  : ఏపీ అసెంబ్లీలో ధూళిపాళ్ళ మరో సంచలనం

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న భరత్ పదవికి రాజీనామా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. వైసీపీ ఉన్న సమయంలో.. కుప్పం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఓ కేసు కూడా నమోదు అయింది. అలాగే కుప్పం నియోజకవర్గంలో అవినీతి కార్యక్రమాలకు కూడా ఆయన తెరతీసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది. దీనితో ముందు జాగ్రత్తగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా కనపడటం లేదు. ఓడిపోయిన తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి త్వరలో ఆయన పై విచారణ మొదలైతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్