తెలంగాణాలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం తీవ్ర దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటిఆర్ ను దాదాపుగా అరెస్ట్ చేసే అవకాశమే కనపడుతోంది. గురువారం ఆయన ఏసీబీ విచారణకు హాజరు అవుతున్న నేపధ్యంలో అరెస్ట్ చేసే అవకాశం ఉండవచ్చు అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను గృహ నిర్భంధం కూడా చేసారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసారు. తాజాగా ఈ వ్యవహారంపై కేటిఆర్ ఎక్స్ లో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసారు.
Also Read : నాడు-నేడు నిజమా ఆబద్దమా..? ఆడిటింగ్ మొదలైంది…!
ప్రభుత్వం తనపై మోపిన ఫార్ములా ఈ అక్రమ కేసు అంశంలో బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు అయ్యే ముందు.. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈని ఎంతో కష్టపడి తీసుకోచ్చాము అని పోస్ట్ చేసారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాదును గమ్యస్థానంగా మార్చడమనే ఫార్ములా ఈ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చామని తెలిపారు.
Also Read : టీటీడీ సంచలన నిర్ణయం.. పది రోజులు ఆ దర్శనాలు రద్దు
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా ఉందన్న ఆయన ఫార్ములా ఈ సందర్భంగా నిర్వహించిన ఈ- మొబిలిటీ వీక్ ద్వారా 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదు అంటూ అసహనం వ్యక్తం చేసారు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసన్న ఆయన మా ప్రభుత్వ విజన్ ను , నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని పోస్ట్ చేసారు. ఈ కేసు ప్రభుత్వం బయటకు తీసినప్పుడు మాత్రం కేటిఆర్ గంభీరంగా మాట్లాడారు. దాదాపు అరెస్ట్ అయ్యే వరకు పరిస్థితి వచ్చినా సరే పెద్దగా విమర్శించే ప్రయత్నం చేయలేదు కేటిఆర్.