Saturday, September 13, 2025 01:04 AM
Saturday, September 13, 2025 01:04 AM
roots

విచారణ తరువాత స్వరం మార్చిన కేటిఆర్

ఏసీబీ అధికారులు తనను విచారించడంపై మాజీ మంత్రి కేటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ వాళ్ళు మొత్తం తనను 85 ప్రశ్నలు అడిగారని అడిగిందే మళ్ళీ అడిగారని తెలిపారు. ఫార్ములా ఈ రేస్ ద్వారా హైదరాబాద్ ఇమేజ్ పెంచామని అన్నారు. రేవంత్ లా గలీజ్ పనులు మేము చేయలేదు అని.. ఏసీబీ వాళ్లకు చెప్పానన్నారు. ఎన్ని సార్లు రమ్మని చెప్పిన వస్తా అని చెప్పినా అంటూ ఆయన కామెంట్స్ చేసారు. ఎన్ని కేసులు పెట్టిన ఇస్తానని మోసం చేసిన హామీల గూర్చి మాట్లాడుతామని స్పష్టం చేసారు.

Also Read : ఫార్ములా ఈ రేస్ తో వైసీపీకి లింకులు..?

ఇది లొట్టపిసు కేసన్న కేటిఆర్.. నేను జైల్ కి వెళ్లినా అందరిని పంపాలి అని రేవంత్ ఆలోచన చేస్తునారని మండిపడ్డారు. రేవంత్ కి బిఅరెస్ నాయకులు ఎవరు భయపడారని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి ని ఎవరు గుర్తు పట్టడం లేదన్న ఆయన నిజాయితీ కి ధైర్యం ఎక్కువ అన్నారు. లొట్టపిసు కేసు..లొట్టపిసు ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేసారు. రేవంత్ ప్రశ్నలు పంపితే మళ్ళీ విచారణ కి పిలుస్తారు కావొచ్చు వెళ్తా పిలిస్తే అంటూ కేటిఆర్ కామెంట్స్ చేసారు. చిన్న తప్పు గాని అవినీతి గాని చేయలేదన్నారు.

Also Read : కేటీఆర్‌ను ఏసీబీ సంధించిన ప్రశ్నలు ఇవే…!

సుమారు 7 గంటల పాటు కొనసాగిన ఏసీబీ విచారణ జరగగా… ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించాను అని తెలిపారు కేటీఆర్‌. రేవంత్‌ రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారని నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చాను అన్నారు. డబ్బు పంపిన మాట వాస్తవమే.. కానీ ఇందులో అవినీతి ఎక్కడుందని నిలదీశారు. అయితే ఉదయం కేటిఆర్ విచారణకు వెళ్ళే ముందు చాలా కంగారుగా కనిపించారు. సోషల్ మీడియాలో కూడా చాలా జాగ్రత్తగా పోస్ట్ చేసారు. అయితే విచారణ అనంతరం మాత్రం ఆయన స్వరంలో మార్పు కనపడింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్