రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. గత పదేళ్ళ కాలంలో ఈ ఊహ మరింత కష్టంగా ఉంది. మహారాష్ట్రలో పవార్ కుటుంబంలో చీలిక, మధ్యప్రదేశ్ లో సింధియా బిజెపి ఎంట్రీ, అరవింద్ కేజ్రివాల్ జైలుకు వెళ్ళడం.. ఇలా ఎప్పుడూ ఏదోక సంచలనాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతు వచ్చింది. షర్మిల దెబ్బకు అప్పట్లో మీడియా మొత్తం షేక్ అయితే ఇప్పుడు కవిత దెబ్బకు తెలంగాణా రాజకీయాలు ఊగిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో నమ్మకమైన నేతగా ఉన్న కవిత తిరుగుబాటు ఊహించని పరిణామం.
Also Read : మీ డెసిషన్ ఫైనల్.. మంత్రి పదవిపై చంద్రబాబుకు పవన్ క్లారిటీ
ఆమె తిరుగుబాటు చేయడంలో తప్పు లేదు గానీ.. హరీష్ ను టార్గెట్ చేయడమే ఆ పార్టీ కార్యకర్తలు అసలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏం జరుగుతుందో అర్ధమయ్యే లోపు చాలా జరిగాయి. కానీ జరిగేది ఏంటో అర్ధం కాలేదు. మా అక్కని నెత్తిన పెట్టుకున్న వాళ్ళే నానా కూతలు కూస్తున్నారు. అక్క ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళే చింపేసారు. ఈడీ కేసులో నెత్తిన ఎక్కించుకున్న లాయరే.. నీకు క్రమ శిక్షణ లేదంటూ సస్పెండ్ చేసాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది..? హరీష్ ను కవిత టార్గెట్ చేస్తే.. హరీష్ ఏం చేస్తారు..?
ఈ భయం కార్యకర్తల కంటే బీఆర్ఎస్ అధిష్టానంలో ఎక్కువగా ఉంది. హరీష్ రావు.. సిఎం రేవంత్ తో కుమ్మక్కు అయ్యారని కవిత ఆరోపించడం, కుటుంబంలో చీలిక తెచ్చి పార్టీని లాక్కోవాలని చూస్తున్నాడు అంటూ విమర్శించడం ఆశ్చర్యం కాదు.. కొడాలి నానీ భాషలో చెప్పాలంటే.. ఆశ్చర్యానికి అమ్మ మొగుడు లాంటి పరిస్థితి. అందుకే హరీష్ ఏ సంచలన నిర్ణయం తీసుకోకుండా కేటిఆర్ జాగ్రత్త పడుతున్నారు. మొన్న సాయంత్రమే హరీష్ ఇంటికి వెళ్ళిన కేటిఆర్.. అప్పటి నుంచి అక్కడే ఉన్నారట.
Also Read : హరీష్ పై బాంబులు పేల్చిన కవిత.. మా అన్నను ఓడించడానికి కుట్ర చేసాడు..!
ఈ రోజు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని నిన్నే సమాచారం ఇవ్వడంతో, కేటిఆర్ మరింత అప్రమత్తమై బావ గారి దగ్గరే ఉన్నట్టు తెలుస్తోంది. హరీష్ ఏ సంచలన నిర్ణయం తీసుకున్నా.. బీఆర్ఎస్ బ్రతకడం కష్టమే. ఆ పార్టీకి తల కేసీఆర్ అయితే గుండె హరీష్. ఈ విషయం కేటిఆర్ కు క్లారిటీ ఉంది. అందుకే ఇప్పుడు హరీష్ ను కాపాడుకోవడానికి, ఆయన తీసుకునే నిర్ణయాల నుంచి వెనక్కు లాగడానికి కేటిఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.