అమరావతి అనేది ఏపీ రాజధాని మాత్రమే కాదు. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర కూడా ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరలింగేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం అమరావతి. ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి అమరావతి. అందుకే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అమరావతి ప్రాంతంలోనే 2006లో కాలచక్ర సమ్మేళనం నిర్వహించారు. అమరావతిలో కాలచక్ర సమ్మేళనం అనేది ఒక ముఖ్యమైన బౌద్ధ ధార్మిక సమ్మేళనం. ఇది అమరావతిలో జరిగిన ఒక ప్రత్యేకమైన బౌద్ధ కార్యక్రమం. బౌద్ధ భిక్షువులు, భక్తులు ఇక్కడ సమావేశమై కాలచక్ర ధ్యానం బోధనలు చేశారు. ఇక అమరావతిని దేవతల రాజధాని అని కూడా అభివర్ణిస్తారు.
Also Read : చంద్రబాబుపై క్యాడర్ ఫైర్.. ఇదేనా మిజరబుల్ ట్రీట్మెంట్..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది.. ఎక్కడ.. అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో కొనసాగుతున్న రోజుల్లోనే గుంటూరు – విజయవాడ మధ్య రాజధాని వచ్చే అవకాశముందనే పుకార్లు షికారు చేశాయి. అందుకే 2012-14 మధ్యకాలంలోనే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. భూ క్రయ విక్రయాలు భారీగా జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుంటూరు – విజయవాడ మధ్య లేదా నూజివీడు, లేదా దొనకొండ ప్రాంతాలను సూచించింది. వీటిల్లో దొనకొండకు నీటి సమస్య ఉంది. నూజివీడు ప్రాంతం ఖమ్మం జిల్లా సరిహద్దు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. దీంతో గుంటూరు – విజయవాడ మధ్య అందరికీ అనుకూలంగా ఉంటుందని ఆనాటి ప్రజలు ఏకగ్రీవంగా అంగీకరించారు.
Also Read : సురేష్ బాబు సంచలన నిర్ణయం.. త్వరలో చంద్రబాబు వద్దకు
అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసినప్పుడు నాటి ప్రతిపక్ష నేత జగన్ కూడా అందుకు అంగీకరించారు. అలాగే రాజధాని నిర్మాణానికి కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని కూడా ఆనాడు అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. ఇదంతా 2019 ఎన్నికలకు ముందు. వైసీపీ అధికారంలోకి వస్తే.. రాజధాని నిర్మాణం ఆగిపోతుందని కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు హెచ్చరించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తాడేపల్లిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారు.. కాబట్టి రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అంటూ కంటితుడుపు మాటలు చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ తన అసలు స్వరూపం బయటపెట్టారు. మేక వన్నె పులి అనే మాటకు అసలైన ప్రతిరూపం తనే అని రుజువు చేశాడు. అమరావతిపై విషం చిమ్మారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీకి 3 రాజధానులు ఉంటే తప్పేంటి అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. శాసన, న్యాయ, పరిపాలన రాజధానులుగా అమరావతి, కర్నూలు, విశాఖ ఉంటాయని తుగ్లక్ ప్రతిపాదన చేశారు జగన్. దీనిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తినా కూడా జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.
Also Read : చెవిరెడ్డికి తుడా దెబ్బ.. అరెస్టుకు రెడీ..?
జగన్ ప్రకటనతో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు, ప్రజలతో పాటు ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చివరికి జగన్ కూడా పరదాల మాటున తన పర్యటనలు కొనసాగించారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఉత్తరాంధ్ర ప్రజలు 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. అందుకే విశాఖ నగరంలోనే కాదు.. ఉత్తరాంధ్ర మొత్తం మీద వైసీపీకి వచ్చినవి 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే. ఇక న్యాయ రాజధాని ప్రతిపాదనను కూడా రాయలసీమ వాసులు వ్యతిరేకించారు. అందుకే కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కలిపి వైసీపీ కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. చివరికి జగన్ సొంత జిల్లా కడపలో కూడా మెజారిటీ కూటమి సర్కార్‌దే.
Also Read : టీడీపీలోకి ఆ ఇద్దరు మాజీలు..!
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. అమరావతి పునః ప్రారంభం పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. నాటి నుంచి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అయినా సరే వైసీపీ నేతలు మాత్రం అమరావతిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ముంపు ప్రాంతమని.. అడవి అని.. మనుషులు నివసించేందుకు అనువైన ప్రదేశం కాదని.. చివరికి భూకంప ప్రభావిత ప్రాంతమని కూడా ప్రచారం చేశారు. నాయకులు కూడా తక్కువేం తినలేదు. బొత్స స్మశానం అన్నారు.. నాటి సభాపతి తమ్మినేని సీతారాం అయితే ఎడారి అని వ్యాఖ్యానించారు. ఇక మంత్రి స్థానంలో ఉన్న కొడాలి నాని, రోజా అయితే నిరసన చేస్తున్న రైతులను, మహిళలను పెయిడ్ ఆర్టిస్టులన్నారు. చివరికి అమరావతికి అనుకూలంగా మాట్లాడిన రజనీకాంత్ వంటి వారిపై కూడా నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు బాబు, పవన్ రెడీ
అమరావతి పూర్తి అయితే వైసీపీకి పుట్టగతులు కూడా ఉండవనే భయంతో ఇప్పుడు సొంత మీడియా ద్వారా కూడా అత్యంత నీచమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసేందుకు కూడా జగన్ అండ్ కో వెనుకాడటం లేదు. అమరావతిని దేవతల రాజధాని అని చరిత్రకారులు చెబుతుంటే.. వైసీపీ మీడియా మాత్రం అది వేశ్యల రాజధాని అని.. అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు వ్యభిచారం చేస్తారని కారు కూతలు కూస్తున్నారు. జర్నలిస్టు ముసుగులో, విశ్లేషకుల ముసుగులో ఈ తరహా వ్యాఖ్యలు చేసి తమ నీచ బుద్దిని బయటపెట్టుకున్నారు. వైసీపీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు.. పార్టీ నుంచి తీసుకుంటున్న సొమ్ముకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకో ఈ తరహా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. ఇందులో అత్యంత నీచమైన విషయం ఏమిటంటే.. వీరిద్దరిలో ఒకరు గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కూడా పని చేసిన ఘనులు. మరొకరు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంట. అసలు ఈ పదవి ఆయనకు ఎవరిచ్చారో ఇప్పటికే అసలైన ఎడిటర్స్‌కు తెలియదు.
Also Read : వైసీపీకి మరో రాజ్యసభ ఎంపీ రాంరాం
పాత్రికేయ విలువలు మాకు బాగా తెలుసు అని గొప్పలు చెప్పుకునే ఈ ఇద్దరు కూడా నిజమైన పాత్రికేయులా అంటే.. కాదనే అనాలి. ఎందుకంటే.. ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నామని చెప్పుకునే ఈ ఇద్దరు మహిళలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన వార్తలు రాసేటప్పుడు, వ్యాఖ్యలు చేసే సమయంలో పాటించాల్సిన కనీస నియమాలు తెలియకపోవడమే. మైనర్‌లకు సంబంధించిన ఏవైనా అకృత్యాలు జరిగితే.. వారి పేరు, వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టకూడదు. అలాగే మహిళల గురించి కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదు కూడా. కానీ ఈ ఇద్దరు కలిసి వైసీపీ అధికారిక ఛానల్ సాక్షి మీడియాలో ఓ డిబేట్ నిర్వహించారు. ఇందులో విశ్లేషకునిగా పాల్గొన్న కృష్ణంరాజు అమరావతిపైన, మహిళలపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Also Read : తండ్రీ, కొడుకుల అరెస్టుకు రంగం సిద్ధం..? ఎమ్మార్వోకి మూడింది..?
ఇంకా చెప్పాలంటే.. తన ఇంట్లో మహిళలు చూస్తుంటారనే కనీస స్పృహ కూడా లేకుండా నీచంగా మాట్లాడారు. దీనిని ఖండించాల్సిన కొమ్మినేని.. నిస్సిగ్గుగా వెటకారంగా నవ్వుతూ.. మిమ్మల్ని ట్రోల్ చేస్తారన్నారు తప్ప.. ఇలాంటి వ్యాఖ్యలు తప్పు.. క్షమాపణ చెప్పాలని మాత్రం చెప్పలేదు. ఈ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా మహిళలతో పాటు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. పాత్రికేయ ముసుగు వేసుకున్న ఈ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అమరావతి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు చివరికి తమ పార్టీ అధినేత భార్యకు కూడా తగులుతున్నాయని తెలియడంతో తమను కూడా బాత్రూంలో ఏమైనా చేస్తారేమో అనే భయం పట్టుకుంది. తాడేపల్లి ప్యాలెస్ ఉన్నది కూడా అమరావతి ప్రాంతమని.. అంటే.. ఆ ప్యాలెస్‌లోని మహిళలు కూడా వ్యభిచారం చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు వెల్లువెత్తాయి.
Also Read : చేరికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం
దీంతో ఈ విషయం పబ్జీ ఆడుకునే తమ అధినేత చెవిలో పడితే.. తమకు కూడా బాబాయ్‌కి పట్టిన గతే పడుతుందని భయపడిన కొమ్మినేని.. ఇదో చిన్న ఘటన వల్ల జగన్ మీద, భారతీ మీద అనవసరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేయడం శోచనీయమని.. ముందుగా వారికి క్షమాపణలు అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. అసలు తాను ఏమి అనలేదని.. తన ప్రొగ్రాంలో ఓ విశ్లేషకుడు అన్నందుకు ఖచ్చితంగా బాధపడుతున్నాడంట.. అలాగే తమ వల్ల మేడం గారి మీద బురద జల్లుతున్నారని.. అందుకే వారికి కూడా క్షమాపణ చెబుతున్నా అంటూ మరో డిబేట్‌లో మొసలి కన్నీరు కార్చారు. తమ వెనకాల రాజకీయ శక్తి లేదని. అధికారం ఏమీ లేదన్నారు. ఇవి ఉన్న వాళ్లు ఏమైనా చేయగలరు.. చేస్తారు.. అంటూ పరోక్షంగా బాబాయ్ గొడ్డలి పోటును, కోడికత్తి డ్రామాను గుర్తు చేశారు. మొత్తానికి కొమ్మినేనిలో టన్నుల కొద్ది భయం మాత్రం తన మాటల్లో స్పష్టంగా కనిపించింది.