Friday, August 29, 2025 09:32 PM
Friday, August 29, 2025 09:32 PM
roots

బిజెపికి కోమటిరెడ్డి ఆఫర్.. అలెర్ట్ అయిన కాంగ్రెస్..?

తెలంగాణా రాజకీయాలు క్రమంగా ఆసక్తిని రేపుతున్నాయి. గత కొన్నాళ్ళుగా సిఎం రేవంత్ రెడ్డిపై ఏదోక రూపంలో విమర్శలు చేస్తూ వస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఏదో సంచలనానికి తెర తీస్తున్నారు అనే ఓ వార్త తెలంగాణా రాజకీయాలను షేక్ చేస్తోంది. మంత్రి పదవి విషయంలో పట్టు వదలని రాజగోపాల్ రెడ్డి.. ఏకంగా తన అన్నను కూడా రాజీనామా చేయమని కోరినట్టు ఇటీవల ప్రచారం జరిగింది. ఆ తర్వాత నుంచి సిఎం రేవంత్ రెడ్డిని ఆయన నేరుగా టార్గెట్ చేసారు.

Also Read : అంతా అబద్దం.. ధర్మస్తలి కేసు క్లోజ్.. సాక్షి అరెస్ట్..!

ఇక ఇప్పుడు బిజెపికి అనుకూలంగా ఆయన రాజకీయం చేసే సంకేతాలు సైతం కనపడుతున్నాయి. తనతో సన్నిహితంగా ఉండే కొందరు ఎమ్మెల్యేలను తీసుకుని బిజెపిలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపారని, వారు కూడా సిద్దంగా ఉన్నారని ఓ ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఇది ఆసక్తిని రేపింది. ఆయన కారణంగా బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా.. ప్రభుత్వాన్ని కూల్చడమే ఆయన లక్ష్యం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Also Read : వన్డేలు ఆడతారు.. కోహ్లీ, రోహిత్ పై బోర్డు క్లారిటీ..!

బిజెపి – బీఆర్ఎస్ ను దగ్గర చేసేందుకు రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. బీఆర్ఎస్ – బిజెపి దగ్గరయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. సరైన మెజారిటీ వస్తే.. బీఆర్ఎస్ మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆఫర్ ఆయన బిజెపికి ఇచ్చారంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడింది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన రహస్యంగా భేటీ అయిన ఎమ్మెల్యేలతో స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారనే వార్తలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్