తెలంగాణా రాజకీయాల్లో.. పార్టీల్లో అంతర్గత విభేదాలు కాస్త చికాకుగా మారిన సంగతి తెలిసిందే. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ లో వాతావరణం వేడెక్కింది. గత కొన్ని రోజులుగా తెలంగాణాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆయన.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసారు. మునుగోడు కోసం అవసరమైతే ప్రభుత్వంపై పోరాడతాను అంటూ ఆసక్తిని పెంచారు.
Also Read : భారీ బడ్జెట్ కు గుడ్ బై..
పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారన్న ఆయన.. ఆలస్యమైనా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తానని పేర్కొన్నారు. గత కొన్నాళ్ళుగా మంత్రి పదవి కావాలంటూ డిమాండ్ చేస్తున్న ఆయన.. సిఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నుంచి హెచ్చరికలు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
Also Read : అనుకున్నది.. అనుకున్నట్లుగానే..!
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వంపై పోరాటానికి కూడా సిద్ధమన్న ఆయన, ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ఒత్తిడి తెస్తానని తెలిపారు. ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేస్తా అంటూ స్పష్టం చేసారు. మొన్నటి వరకు తనకు మంత్రి పదవి కావాల్సిందే అని పట్టుబట్టిన ఆయన.. ఇప్పుడు కాస్త మార్చి మాట్లాడటం ఆసక్తిని రేపింది. ఆలస్యం అయినా పర్వాలేదు అంటూ కామెంట్ చేసారు. ఇటీవల తన అన్నను మంత్రి పదవికి రాజీనామా చేయమని కోమటిరెడ్డి ఒత్తిడి చేసినట్టు వార్తలు వచ్చాయి.