Saturday, August 30, 2025 06:45 AM
Saturday, August 30, 2025 06:45 AM
roots

రూటు మార్చిన రాజగోపాల్ రెడ్డి.. డైరెక్ట్ గా రేవంత్ పేరే వాడుతూ..!

తెలంగాణా రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తనకు మంత్రి పదవి డిమాండ్ చేస్తున్న కోమటిరెడ్డి.. ఈ మధ్య కాలంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఈ వ్యవహారం ముఖ్యంగా సిఎం రేవంత్ కి చికాకుగా మారిందనే చెప్పాలి. మంత్రి పదవి విషయంలో వెనక్కు తగ్గని రాజగోపాల్ రెడ్డి.. పదే పదే సిఎం టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేసారు.

Also Read : కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న జీఎస్టీ..?

ఇప్పటి వరకు సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయని రాజగోపాల్ రెడ్డి ఈసారి మాత్రం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేసారు. బిల్లుల చెల్లింపులలో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు చేసారు. పదవులు మీకే..పైసలు మీకేనా…అంటూ వ్యాఖ్యలు చేసారు. పదవులు తీసుకోండి.. కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి.. మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యలు చేసారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా రాజగోపాల్ పై విమర్శలు చేసారు సిఎం రేవంత్ కామెంట్స్ చేసారు.

Also Read : ఎక్కడా తగ్గని పుతిన్.. ఒప్పందం అప్పుడేనన్న ట్రంప్

రాజకీయాల్లో పదిమంది పోటీ పడినా.. కుర్చీ ఒక్కరికే దక్కుతుందని.. అది అన్నదమ్ములైనా.. ఇంకెవరైనా.. అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ కాస్త ఘాటుగా మాట్లాడారు. ఆ తర్వాత మునుగోడులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాజగోపాల్ రెడ్డి పాల్గొని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ పై విమర్శలు చేశారు.. ఇప్పటి వరకు రేవంత్ పేరు ఎత్తని రాజగోపాల్ రెడ్డి.. ఈ సారి నేరుగా సీఎం పేరు చెప్పి మరీ విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్