Wednesday, February 4, 2026 06:05 PM
Wednesday, February 4, 2026 06:05 PM

ఈ చిచ్చు ఎప్పుడు చల్లారుతుందో..?

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గం మధ్య చిచ్చు తారాస్థాయికి చేరుకుంది. తొలి నుంచి కొలికపూడి వర్సెస్ చిన్ని అన్నట్లుగానే తిరువూరు పంచాయతీ నడుస్తోంది. ఇప్పటికే కొలికపూడి మూడుసార్లు టీడీపీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరయ్యారు. అటు చిన్ని కూడా ఈ వివాదంపై ఒకసారి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఇరు పక్షాల నేతలు సైలెంట్‌గా ఉన్నారు. అయితే రెండు రోజులుగా ఇరు పక్షాల నేతల మధ్య మాటల దాడులు కాస్తా.. శృతిమించడం టీడీపీ అగ్ర నేతలను సైతం కలవరపాటుకు గురి చేస్తోంది.

Also Read : రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన..!

తొలి నుంచి దూకుడుగానే వ్యవహరించిన ఎమ్మెల్యే కొలికపూడి.. ఇటీవల వరుస పోస్టులతో ఎంపీ వర్గానికి నిద్ర లేకుండా చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీలోని చిన్ని వర్గం నేతలను ఉద్దేశించి కొలికపూడి తన వాట్సప్ స్టేటస్‌లో వివాదాస్పద పోస్టులు పెట్టారు. “నువ్వు దేనికి అధ్యక్షుడివి?? పేకాట క్లబ్‌ కా??, పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా.. రాయల్..” అంటూ తన స్టేటస్‌లో పోస్ట్ చేశారు. ఇది ఓ మండల పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి పెట్టారనేది టీడీపీ నేతల మాట.

ఆ వెంటనే కొలికపూడి ఓ మహిళతో ఉన్న ఫోటోను కొందరు నేతలు విడుదల చేశారు. ఈ ఫోటో టీడీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది కూడా. చివరికి X వేదికగా కొంత మంది నేరుగా చంద్రబాబు, లోకేష్‌ను ట్యాగ్ చేసి.. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపై కొలికపూడి టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. కొలికపూడి ఫోటో‌కు కౌంటర్‌గా ఇద్దరు నేతల ఫోటోలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోస్టు చేశారు. తిరువూరుకు చెందిన బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్వరరావులు మహిళలతో ఉన్న ఫోటోలను కొలికపూడి విడుదల చేశారు.

Also Read : మంత్రి లోకేష్‌కు ఆ విషయంలో ఇబ్బందులు..!

“రాజేశ్వరరావు ఇల్లు కూడా చూస్తారా…????” అంటూ పోస్టులో వ్యాఖ్యానించారు. కొలికపూడి చర్యలపై ఎంపీ చిన్ని వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏఐ ఫొటోలు విడుదల చేశారంటూ మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఒకరిపై ఒకరు ఇప్పుడు ఏఐ ఫోటోలు విడుదల చేశారు.. త్వరలో వీడియోలు కూడా వస్తాయా అనే చర్చ నడుస్తోంది.

ఈ వ్యవహారంపై పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తమకు గిట్టని వారిపైన ఇలా ఏఐ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసి వారి పరువు బజారున పడేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రోజు కొలికపూడి శ్రీనివాస్.. రేపు పొత్తులో ఉన్న మరో వ్యక్తికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో.. అని వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లో ఎవరైనా తమకు వ్యతిరేకంగా మాట్లాడితే మొదటి అస్త్రం ఇలాగే ఉపయోగిస్తారేమో అని భయపడుతున్నారు కూడా. దీంతో కొలికపూడి, చిన్ని మధ్య చిచ్చు ఎప్పుడు చల్లారుతుందో అని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్