Sunday, October 26, 2025 06:03 AM
Sunday, October 26, 2025 06:03 AM
roots

లండన్ లో కోహ్లీ ఫిట్నెస్ టెస్ట్.. షాక్ అయిన ఫ్యాన్స్

భారత క్రికెట్ జట్టులో సీనియర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో ఏం జరుగుతుందో అంటూ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ తరుణంలో ఇద్దరి ఫిట్నెస్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. రోహిత్ శర్మ ఇటీవల ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇక విరాట్ కోహ్లీ పరిస్థితి ఏంటీ అనే దానిపై అనేక చర్చలు జరిగాయి. కోహ్లీ లండన్ లోనే ఉండటంతో ఫిట్నెస్ టెస్ట్ జరగడం లేదా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.

Also Read : రష్యా భారీ డిస్కౌంట్.. అమెరికాకు భారత్ షాక్..!

ఈ తరుణంలో నేషనల్ మీడియాలో ఓ సంచలన కథనం ఆశ్చర్య పరిచింది అభిమానులను. భారత ఆటగాళ్లలో ఎక్కువ మంది తమ ఫిట్‌నెస్ టెస్ట్ కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నా సరే కోహ్లీ రాలేదు. కాని బోర్డు పెద్దలు అతనికి అక్కడే ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారట. యూకే లో ఫిట్నెస్ టెస్ట్ కు అటెండ్ కావడానికి అనుమతి కోరగా.. బోర్డు అక్కడే కంప్లీట్ చేసిందని జాతీయ మీడియా పేర్కొంది. కోహ్లీ ఈ టెస్ట్ లో పాస్ అయినట్టు సమాచారం. రోహిత్ శర్మ కూడా బెంగళూరు వెళ్లి టెస్ట్ కంప్లీట్ చేసాడు.

Also Read : రష్యాతో ఉంటారా.. సిగ్గుచేటు.. అమెరికా సంచలన కామెంట్స్

రోహిత్ శర్మ , శుభ్‌మాన్ గిల్ , మహమ్మద్ సిరాజ్ వంటి వాళ్ళు ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యారట. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో చాలా మంది ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటన ఉన్న నేపధ్యంలో ఫిట్నెస్ టెస్ట్ విషయంలో బోర్డు సీరియస్ గా ఉంది. టెస్ట్ సీరీస్ కోల్పోవడంతో వన్డే సీరీస్ పై దృష్టి పెట్టింది. ఈ నెల చివరి వారంలో ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సీరీస్ కు రోహిత్ నే కెప్టెన్ గా కొనసాగించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్