కింగ్ ఫిషర్ టవర్స్.. విజయ్ మాల్యా వ్యాపార సామ్రాజ్యం ఎంత సంచలనమో.. కింగ్ ఫిషర్ టవర్స్ కూడా అదే రేంజ్ లో సంచలనం అయింది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ఈ భవనాన్ని విజయ్ మాల్యా నిర్మించారు అనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై పెద్ద ఎత్తున అప్పట్లో విజయ్ మాల్యాను రాజకీయ నాయకులు కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు. రాజ్యసభ ఎంపీ కావడంతో ప్రతిపక్షాలకు ఆయన టార్గెట్ అయ్యారు. కింగ్ ఫిషర్ టవర్స్ విషయంలో మాల్యా క్లారిటీ మాత్రం అప్పట్లో ఇవ్వలేదు.
Also Read : ఆయన చెప్పినట్లే.. గీత దాటితే అంతే..!
అయితే దాని నిర్మాణం మాత్రం ఎప్పటికీ సంచలనం అనే చెప్పాలి. భవనం పైన నిర్మించిన పెంట్ హౌస్ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. పెంట్ హౌస్ అంటే చిన్న గా నిర్మిస్తారు. కాని మాల్యా మాత్రం పైన ఓ బంగ్లా నిర్మించారు. దాని మీద హెలిప్యాడ్ నిర్మాణం కూడా ఉంది. తాజాగా రాజ్ షమాని పాడ్ కాస్ట్ లో మాల్యా మాట్లాడుతూ దాని నిర్మాణం గురించి వివరణ ఇచ్చారు. బెంగళూరు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున కబ్బన్ పార్క్ వైపు ఉన్న ఆ పెంట్ హౌస్ గురించి ఆయన ఆసక్తికర విషయం బయటపెట్టారు.
Also Read : ఆ మంత్రులను వెంటాడుతున్న చంద్రబాబు
నేను పెరిగిన మరియు నా తండ్రి నివసించిన బంగ్లా అదే. ఇది మొదట కింగ్ ఫిషర్ టవర్స్ ఇప్పుడు ఉన్న అదే స్థలంలో ఉందని వెల్లడించారు. అధిక విలువ కలిగిన భూమిని లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనతో ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ తనను సంప్రదించారని ఆయన వెల్లడించారు. అప్పుడు.. ఇర్ఫాన్ తో.. తాను నివసించిన బంగ్లాను టవర్స్ పైన నిర్మిస్తే తాను అంగీకరిస్తా అని చెప్పారు అని గుర్తు చేసుకున్నారు. దానికి ఇర్ఫాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. వ్యాపార ప్రయోజనాలతో ఆ నిర్మాణం చేపట్టామని ఆయన పేర్కొన్నారు.