టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్తు పై గత కొన్నాళ్ల నుంచి ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. రాజకీయంగా ఒకప్పుడు అత్యంత ప్రభావం చూపిన వ్యక్తుల్లో దేవినేని ఉమా కూడా ఒకరు. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉండేది. 2019లో పార్టీ ఓటమి తర్వాత ఉమా వైసీపీ పై గట్టి పోరాటమే చేసినా 2024 లో మాత్రం ఆయనకు సీటు రాలేదు. ఇక 2024 తర్వాత ఆయనకు ఏదో ఒక పదవి వస్తుందని చాలామంది ఆశించారు.
Also Read : ముంబైలో అంతా సెట్ చేసిన నానీ..? టీడీపీ ఆరోపణ నిజమేనా..?
ఎమ్మెల్సీ పదవీ లేదంటే కార్పొరేషన్ పదవుల్లో ఏదో ఒక పదవిని అధిష్టానం కట్టబెడుతుందని చాలామంది ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు ఉమాకు ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదు. అయితే త్వరలోనే దేవినేని ఉమా ను ఎమ్మెల్సీగా పంపించే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం ఒకటే జరుగుతుంది. ఇటీవల విజయవాడకు చెందిన ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఆ స్థానం నుంచి ఉమాను మండలికి పంపించే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : రికార్డ్ బ్రేకింగ్ జోడీ.. సాయి సుదర్శన్ – గిల్
ఒకవేళ ఈ స్థానం నుంచి కాకపోయినా త్వరలోనే మరిన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. వీటిలో ఒకటి ఉమాకు ఖచ్చితంగా ఖరారు చేయవచ్చని టిడిపి వర్గాలు అంటున్నాయి. పార్టీ అధిష్టానంతో ఉమాకు కాస్త గ్యాప్ ఉంది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తన కొడుకు పెళ్లి తర్వాత ఆ గ్యాప్ ఉమా తగ్గించుకున్నారు అనేది రాజకీయ వర్గాల మాట. టిడిపికి అత్యంత విధేయుడుగా ఆయనకు గుర్తింపు ఉంది.. 2014 నుంచి 2019 వరకు మంత్రిగా కూడా సమర్థవంతంగా వ్యవహరించారు. మరి అందరూ ఆశించినట్లు ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది.