ఆంధ్రప్రదేశ్ లో అదాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై అమెరికా కోర్ట్ లో కేసు నమోదు చేయడం సంచలనం అయింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు గురి పెట్టి విమర్శలు చేస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ లు చేస్తున్నాయి. ఇక నేడు అదాని పవర్ పై కేబినెట్ లో కీలక చర్చ జరగనుంది. సెకి ఒప్పందం పై ఏ చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కేబినెట్ చర్చిస్తోంది.
Also Read : మిస్టరీగానే నటి శోభిత ఆత్మహత్య…?
ఈ విషయంలో పలు కీలక అంశాలను పరిశీలిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఒప్పందాన్ని రద్దు చేసి పెనాలిటీ చెల్లించడం, ఒప్పందం లోని ధరల తగ్గింపు పై చర్చించడం, ఆధాని పవర్ పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ ని పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే సెకి తో ఒప్పందం కారణంగా యూనిట్ విద్యుత్ ధరకు 2.49 పైసలకు కొనుగోలు చేస్తున్న మొత్తం ఛార్జ్ 3.87 పైసలకు చేరుతుందని అధికారులు అంటున్నారు. కస్టమ్స్ డ్యూటీ జిఎస్టి తో పాటు ట్రాన్స్మిషన్ చార్జెస్ 3. 87 పైసలు కానుంది యూనిట్ విద్యుత్ ధర.
Also Read : అరబిందోకి మూడింది, రంగంలోకి సిఐడీ, పవన్ హడావుడి వర్కౌట్ అయిందా…?
అదాని విద్యుత్ ఒప్పందం కారణంగా 1750 కోట్లు ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. అదాని విద్యుత్ పై ఏమి చర్యలు తీసుకోవాలి అనే అంశం పై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు… దీనిపై కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. కేబినెట్ లో పూర్తి వివరాలను సహచరుల ముందు ఉంచారు. విద్యత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకొని పెనాలిటీ చెల్లించడమే ఉత్తమమనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఒప్పందం రద్దు చేసుకుంటే 2100 కోట్ల రూపాయలు పెనాలిటీ గా చెల్లించాల్సి ఉంటుంది.