Friday, September 12, 2025 03:22 PM
Friday, September 12, 2025 03:22 PM
roots

లిక్కర్ కేసులో కీలక ముందడుగు.. సంచలనానికి సిద్దం..!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం దాదాపు రెండు నెలల నుంచి హాట్ హాట్ గా నడుస్తూ వస్తోంది. ఈ వ్యవహారంలో పలు కీలక అరెస్టులు కూడా జరిగాయి. త్వరలోనే పెద్ద తలకాయలను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు సైతం వినిపించాయి. ముఖ్యంగా వైయస్ జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అలాగే ధనుంజయ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత పరిణామాలు ఆశ్చర్యం కలిగించాయి. వీళ్ళిద్దరిని అరెస్టు చేయడంతో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఉన్న ప్రముఖులను కూడా అరెస్టు చేయవచ్చని భావించారు.

Also Read : వారికి పదవులు ఉన్నట్లా.. లేనట్లా..?

వాళ్ళిద్దర్నీ అరెస్టు చేసిన తర్వాత మీడియాలో కొన్ని రోజులు హడావుడి నడిచింది. కానీ ఇప్పుడు ఈ కేసు గురించి పెద్దగా మీడియాలో వార్తలు కనపడటం లేదు. సోషల్ మీడియాలో సైతం దీని గురించి చర్చ కూడా కనుమరుగైపోయింది. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతి కోసం ఎదురుచూస్తోంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అరెస్టు చేయబోయే వ్యక్తుల విషయంలో రాజకీయ లేదంటే న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read : ఇంటింటికీ తొలి అడుగు.. పడుతుందా..?

న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని ఆధారాలను సేకరించి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ విషయంలో ముందు అడుగు వేయవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయవచ్చు అనేది ముందు నుంచి ఉన్న ప్రచారం. అయితే జగన్ కు వ్యతిరేకంగా ఈ వ్యవహారంలో ఆధారాలు సేకరించడంలో అధికారుల విఫలమయ్యారనే వాదనలు సైతం వినపడుతున్నాయి. అరెస్టు అయిన నిందితులనుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడంతోనే ఈ విషయంలో ముందడుగు పడలేదనే మాట వినపడుతోంది. అందుకే జూన్ 10న చేయవలసిన ఒక కీలక అరెస్టు వాయిదా పడింది అనేది రాజకీయ వర్గాల మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్