ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తరుపు లాయర్ కోర్ట్ లో ఆసక్తికర వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి ఏ ప్రమేయం లేదని.. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడా ఆయన లిక్కర్ స్కాంలో లేరని స్పష్టం చేసారు. పొలిటికల్ పార్టీలకు నివేదికలు మాత్రమే ఇస్తారు తప్ప ఎక్కడా కూడా రాజకీయాలకు రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదన్నారు లాయర్. కేసిరెడ్డి స్వతహాగా వైసీపీ నాయకులకు దగ్గర ఉంటారు కానీ పార్టీకి రాజకీయాలకు ఏ సంబంధం లేదని స్పష్టం చేసారు.
Also Read : బీఆర్ఎస్ కు సైలెంట్ స్ట్రోక్ ఇవ్వబోతున్న హరీష్..?
అమెరికాలో సంపాదించిన దానితో ప్రస్తుతం ఇండియాలో వ్యాపారాలు చేస్తున్నారని.. కేసిరెడ్డి విచారణలో చాలా అంశాలు చెప్పారని ప్రచారం చేస్తున్నారు అదంతా అవాస్తవమన్నారు. కేసిరెడ్డి ఆస్తులను ప్రాథమిక విచారణలో భాగంగా సీజ్ చేసారు తప్ప కేసులో భాగంగా చేయలేదని.. సాయిరెడ్డి గారు చేసింది రాజకీయ విమర్శల భాగమేనని.. పెద్ద వ్యక్తులను తప్పించి లిక్కర్ కేసులో ఏ1 కేసిరెడ్డిని పెట్టడం బట్టి చూస్తే అర్ధం అవుతుందన్నారు. సుప్రీమ్ కోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేసామని పేర్కొన్నారు.
Also Read : ఇంటరెస్టింగ్ గా టెస్ట్ టీం సెలెక్షన్.. కొత్త ఆటగాళ్ళు ఎవరు..?
దిలీప్.. రాజశేఖర రెడ్డి కంపెనీ వ్యవహారాలు చూస్తారని.. లిక్కర్ కేసులో దిలీప్ ప్రమేయం లేదన్నారు. ఈ వాదనల్లో ఆసక్తికర అంశం.. “పెద్ద వ్యక్తులను తప్పించి” లిక్కర్ స్కాం లో మా ప్రమేయం లేదు” ఈ వ్యవహారంలో కేసిరెడ్డి కంటే ముందు వైసీపీ అధినేత మాత్రమే ఉన్నారు. గతంలో కృష్ణ మోహన్ రెడ్డి కూడా ఇదే వాదన వినిపించారు. తమకు ప్రమేయం లేదని కోర్ట్ లో వాదిస్తూ వచ్చారు. విజయసాయి రెడ్డి కూడా దాదాపుగా ఇలాగే చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే.. వీరు అందరూ పరోక్షంగా జగన్ పాత్రనే స్పష్టంగా చెప్తున్నట్టు అర్ధమవుతోందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. బాలాజీ గోవిందప్ప సైతం ఇలాగే విచారణలో వెల్లడించినట్లు సమాచారం.




