Friday, September 12, 2025 01:42 PM
Friday, September 12, 2025 01:42 PM
roots

పాత స్నేహాలకు పదును పెడుతున్న నానీ

విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని మళ్లీ టీడీపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? అంటే అవుననే అభిప్రాయాలు వినపడుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత నాని ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. ఎక్కువగా వైసిపి నేతలతో స్నేహం చేస్తూ వచ్చారు.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు తో పాటుగా పలువురు వైసీపీ నేతలతో ఆయన స్నేహం చేయడమే కాకుండా టీడీపీ నేతలు పై నేరుగా విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందరూ ఊహించినట్టుగానే 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేశారు.

Also Read : ఎంపీ పదవి ఆయనకే.. కూటమిలో క్లారిటీ..!

ఆయనపై ఆయన సోదరుడు చిన్ని పోటీ చేసి ఘనవిజయం సాధించారు. అయితే ఇప్పుడు నాని మళ్లీ టీడీపీకి దగ్గర కావడానికి కష్టపడుతున్నారు. ఇటీవల ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అలాగే ఆయనతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి మాట్లాడుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్, అలాగే విజయవాడలో వివాహం సందర్భంగా ఆయన టిడిపి నేతలతో మాట్లాడిన పద్ధతి చూసిన చాలామంది మళ్లీ టీడీపీకి దగ్గర కావడానికి నాని ప్రయత్నం చేస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పాలిటిక్స్‌కు గుడ్ బై.. పెద్ద ప్లాన్ వేసిన బుగ్గన..!

చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ గతంలో తనకున్న అనుభవాలను కాస్త రాసుకొచ్చారు. అలాగే విజయవాడలో జరిగిన వివాహానికి హాజరైన నాని.. అక్కడున్న టిడిపి నేతలతో అంటి ముట్టనటు వ్యవహరించకుండా కాస్త కుశల ప్రశ్నలు వేస్తూ సరదాగా గడిపే ప్రయత్నం చేశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వంటి వారితో కాస్త సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు. ఇది చూసి అక్కడ ఉన్నవారు నాని మళ్లీ టీడీపీతో కలవడానికి సిద్ధమవుతున్నారంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్