Friday, September 12, 2025 11:23 PM
Friday, September 12, 2025 11:23 PM
roots

కేరళ నర్సు కథ సుఖాంతమా..? ఉరిశిక్ష ఆగినట్టేనా..?

కేరళ నర్సు నిమీష ప్రియకు విధించిన మరణ శిక్షపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్న నేపధ్యంలో యెమెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తనను వేధిస్తున్న వ్యక్తిని చంపినందుకు స్థానిక కోర్ట్ ఆమెకు మరణ శిక్ష విధించింది. కేరళకు చెందిన నర్సును కాపాడటానికి చివరి ప్రయత్నంగా భారత అధికారులు ఆమె కుటుంబంతో చర్చించారు. ఈ తరుణంలో నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. ప్రియాకు రేపు ఉరిశిక్ష విధించాల్సి ఉంది. కానీ హత్యకు గురైన వ్యక్తి కుటుంబం ఉరి శిక్షను వాయిదా వేయాలని కోరడంతో శిక్షను వాయిదా వేసారు.

Also Read : ఆ 5 తప్పులే భారత్ ను ఓడించాయా..?

అయితే ఆమెను విడుదల చేయడం మాత్రం సాధ్యం కాదని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం హౌతీల ఆధీనంలో ఉన్న యెమెన్ రాజధాని సనాలో ఉంది. హౌతీ తిరుగుబాటుదారులతో మన దేశానికి ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. భారత ప్రభుత్వం నిన్న ఉరిశిక్షను ఆపడానికి తన పరిమితుల్లో ఉన్న ప్రతీ ఒక్క ప్రయత్నమూ చేసింది. నిమిషా ప్రియ 2008లో కేరళ నుంచి ఉద్యోగ నిమిత్తం యెమన్ వెళ్లి అక్కడ నర్సుగా జాయిన్ అయింది. ముందు అక్కడున్న స్థానిక ఆస్పత్రులలో ఆమె పని చేసింది.

Also Read : చంద్రబాబుతో భేటీకి రేవంత్ నో..!

ఆ తర్వాత చట్ట ప్రకారం స్థానిక పౌరుడు అయిన తలాల్ అబ్దోల్ మెహదీతో కలిసి సొంత క్లీనిక్ ఓపెన్ చేసింది. అయితే మెహదీ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె డబ్బు లాక్కోవడమే కాకుండా.. ఆమె పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు. ఆమె దేశం విడిచి వెళ్ళకుండా ఉండేందుకు గానూ తీవ్రంగా వేధించడంతో.. 2017 లో ఆమె అతనికి మత్తు మందు ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె పాస్‌పోర్ట్‌ ను లాక్కోవాలని ప్రయత్నం చేయగా.. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆమె యెమెన్ నుండి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్