Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

సైలెంట్ గా కీర్తి పెళ్లి… అతి తక్కువ మంది అతిధులే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది అతిధులతో గోవాలో వివాహాన్ని నిర్వహించింది కీర్తి సురేష్ కుటుంబం. ఈ వివాహానికి మన తెలుగు నుంచి అతి తక్కువ మంది అతిధులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఇక హిందూ సాంప్రదాయం అలాగే క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నా సరే చివరకు హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఈ వివాహాన్ని నిర్వహించారు కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు.

కీర్తి ఇష్టాన్ని ఆమె భర్త అంటోనీ కాదనలేదని.. దీనితో వివాహాన్ని హిందూ సాంప్రదాయంలోనే నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతనితో దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రేమ ఉన్నా సరే ఆమె ఎక్కడ దానికి సంబంధించి బయట పడలేదు. ఇప్పుడు పెళ్లి విషయం బయటకు రావడంతో అతని గురించి పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మన తెలుగులో ఆమె పెద్దగా ఎవరికి ఆహ్వానం పలకలేదని సమాచారం.

అలాగే తమిళ సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దగా ఎవరిని పిలవలేదట. కేవలం 250 నుంచి 300 మంది అతిధులతో మాత్రమే వివాహాన్ని నిర్వహించారని తెలుస్తోంది. వివాహం తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పే అవకాశం ఉండొచ్చని ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం సంతకం చేసిన సినిమాలను మాత్రమే ఆమె ఫినిష్ చేసి ఆ తర్వాత సినిమా వాళ్లకు గుడ్బై చెప్పి విదేశాల్లో సెటిలైపోయే ఆలోచనలో ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కు ఆ స్థాయిలో మరో విజయం దక్కలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్