Monday, October 27, 2025 10:41 PM
Monday, October 27, 2025 10:41 PM
roots

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మాజీ మంత్రులకు రూట్ మ్యాప్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని దాదాపు రెండు మూడు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయన మాత్రం ప్రజల్లోకి వెళ్లే సంకేతాలు కనపడటం లేదు. అయితే ఈ మధ్య కేసీఆర్ కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు మీడియాలో కూడా ఆయన కనపడుతున్నారు. అయితే కేసీఆర్ లో మాత్రం పెద్దగా దూకుడు అయితే కనపడటం లేదు. గతంలో మాదిరిగా కేసీఆర్ విమర్శలు కూడా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎప్పుడైనా తన పార్టీ నేతలు వెళితే వాళ్ల వద్ద చేసిన వ్యాఖ్యలు మినహా కేసీఆర్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రసంగాలు ఉండటంలేదు.

Also Read : కుంకీ ఏనుగులు కోసం రంగంలోకి సీఎం..!

కేసీఆర్ ప్రసంగాలకు నేషనల్ మీడియా కూడా ప్రాధాన్యతిస్తుంది. అలాంటి కెసిఆర్ ఇప్పుడు సైలెంట్ గా ఉండటంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇదే టైంలో కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. అనూహ్యంగా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. త్వరలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : బాబు సీనియర్… ఇక నీ సేవలు చాలు..!

కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ప్రజల్లో కాస్త అసహనం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తలు కేసీఆర్.. సమావేశాలకు హాజరు కావాలని కోరుతున్నారు. ఇక కేసిఆర్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకే సమావేశాలకు దూరమవుతున్నారనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. ఇప్పుడు ఈ అభిప్రాయాలకు చెక్ పెట్టే విధంగా కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ నేతలకు కూడా కేసీఆర్ దీనిపై సంకేతాలు ఇచ్చేశారు.

Also Read : జగన్ పొలిటికల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

తాను అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నానని, ఎమ్మెల్యేలు అందరు సమావేశాలకు హాజరు కావాల్సిందేనని, అలాగే పార్టీ ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరు కావాలని చెప్పినట్లు సమాచారం. అలాగే శాఖల వారీగా బడ్జెట్ పై అవగాహన పెంచుకోవాలని కూడా ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇప్పటికే సూచించారట. ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులు బడ్జెట్ ప్రసంగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వానికి కౌంటర్లు ఇవ్వడంతో పాటుగా తాము గతంలో చేసిన మంచిని కూడా చెప్పుకునే ప్రయత్నం చేయాలని కెసిఆర్ మాజీ మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఇక మీడియా సమావేశాలకు కూడా మాజీ మంత్రులు అందుబాటులో ఉండాలని, బడ్జెట్ ను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్