Saturday, September 13, 2025 01:09 AM
Saturday, September 13, 2025 01:09 AM
roots

కొడితే మామూలుగా ఉండదు.. రేవంత్ కి కేసీఆర్ హెచ్చరిక

జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా… మరి అలాంటింది పులినే వేటాడలంటే… మనం ఇంకెంత ఓపికగ్గా ఉండాలి… అతడు సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్‌. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సైలెంట్‌ అయ్యారు. ఓ 2 నెలలు మాత్రమే నందినగర్‌లోని ఇంట్లో ఉన్నారు.. ఆ తర్వాత ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఒకదశలో కేసీఆర్ ఉన్నారా… లేక రాజకీయ సన్యాసం తీసుకున్నారా అనే అనుమానం కూడా వచ్చింది. ఇలాంటి సమయంలోనే కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీరంగా, మౌనంగా ఉన్నా… కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నా… అంటూ వ్యాఖ్యానించారు. కొడితే మామూలుగా కాదు… గట్టిగా కొట్టడం నా అలవాటు అంటూ మాస్ వార్నింగ్‌ ఇచ్చారు కేసీఆర్.

Also Read : తెలంగాణా పల్లెల్లో ఎన్నికల నగారా..? రేవంత్ కీలక నిర్ణయం..!

కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టార్గెట్ రేవంత్ సర్కార్ అన్నట్లుగా కేసీఆర్ ప్రసంగం సాగింది. మన విజయం తెలంగాణ ప్రజల విజయం అంటూ సాఫ్ట్‌గా ప్రసంగం మొదలుపెట్టిన కేసీఆర్‌… రాబోయే రోజుల్లో విజయం మనదే అని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. ప్రభుత్వ వైఫల్యాలపై తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని… సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ఎండబెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన హయాంలో భూముల ధరలు పెరిగాయని గుర్తు చేసిన కేసీఆర్… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు అమాంతం పడిపోతున్నాయని విమర్శించారు. దీని వల్ల రియల్‌ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుబంధుకు రాంరాం చెప్పారు.. దళితబంధుకి జైభీమ్ చెప్పేశారు.. తులం బంగారం పథకం గోవిందా.. అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు కేసీఆర్.

Also Read : టీడీపీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌.. ఇవే కీలకం..!

కాంగ్రెస్ పాలన అంతటా అసంతృప్తి ఉందన్న కేసీఆర్… ఇకపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కేడర్‌కు పిలుపిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ముంచేసిందని విమర్శించారు. మళ్లీ కరెంట్‌ కోతలు, నీళ్ల వెతలు.. పాలన ా వైఫల్యాన్ని నిలదీస్తే కేసులు పెడతారా అని నిలదీశారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదన్న కేసీఆర్.. ఓట్ల కోసం ముస్లింలను కాంగ్రెస్ వాడుకుంటోందని ఆరోపించారు. సంగమేశ్వరం, బసవేశ్వరం ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ ఎందుకు ఆపిందో చెప్పాలన్నారు. టెండర్లు అడ్డుకోవటం వెనుక మతలబు ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దామని పిలుపునిచ్చారు కేసీఆర్… ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరవ్వాలని… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్