Tuesday, October 28, 2025 01:54 AM
Tuesday, October 28, 2025 01:54 AM
roots

గతం మర్చిపోయి నోరుజారిన కేసీఆర్

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. అలాగే పార్టీ మారిన.. కడియం శ్రీహరికి స్టేషన్ ఘనపూర్ లో ఓటమి ఖాయమన్నారు.

Also Read : తమిళనాడులో విజయ్.. జగన్ ఫార్ములా…?

ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో కాస్త ఆసక్తికర చర్చలకు దారితీస్తున్నాయి. 2014, 2018లో వరుసగా రెండుసార్లు గెలిచిన కేసీఆర్.. అసలు విపక్షాలు లేకుండా చేసి వాళ్లను తమ పార్టీలోకి తీసుకున్నారు. ఏకంగా టిడిపి, కాంగ్రెస్ శాసనసభ పక్షాలను తమ పార్టీలో విలీనం చేసి కొత్త సంస్కృతికి తెర తీశారు. తనకు ప్రతిపక్షాల నుంచి ఇబ్బందులు ఉండకూడదని భావించిన కేసీఆర్.. 86 సీట్లు వచ్చినా సరే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా వ్యవహరించారు.

Also Read : అధికారులపై చంద్రబాబు సీరియస్..!

అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారు అంటూ నీతి వ్యాఖ్యలు చేయడంపై మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 2014లో గులాబీ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి, ఆ పార్టీ శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని తమ పార్టీలోకి తీసుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఎమ్మెల్యేలు లేకుండా చేశారు. 2018 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. అలాంటి కెసిఆర్ ఇప్పుడు నీతులు చెప్పడంపై గులాబీ పార్టీ నేతలే షాక్ అవుతున్నారు

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్