తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె ఈ సంచలన ప్రకటన చేసే అవకాశం కనపడుతోంది. కవిత సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా గత ఆరు నెలల నుంచి అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా నేడు కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
Also Read : చికెన్ లివర్ తో ఫ్యాటీ లివర్ కు చెక్..?
మధ్యాహ్నం 3 గంటలకు జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. అప్పుడే తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను కవిత వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. కవిత తన కొత్త పార్టీకి “తెలంగాణ ప్రజా జాగృతి” అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం ప్రాతిపదికన, సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ పని చేయనుందని సమాచారం.
Also Read : చెన్నై మాస్టర్ ప్లాన్.. ఓపెనింగ్ జోడీపై కీలక నిర్ణయం..!
శ్రీరామ నవమి రోజే పార్టీ జెండా, గుర్తు, విధివిధానాలను కవిత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, రాబోయే ఎన్నికల్లో ఆమె ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే అంశంపై కూడా ఈ ప్రెస్ మీట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ అస్తిత్వం, యువత మరియు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఈ పార్టీ వ్యూహాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కవిత చేయబోయే ఈ ప్రకటనపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

