Thursday, September 11, 2025 06:32 PM
Thursday, September 11, 2025 06:32 PM
roots

బీసీ రాగం ఎత్తుకున్న కవిత.. మరో ఉద్యమానికి సిద్దం..!

గత కొన్ని రోజులుగా తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా సంచలన కామెంట్స్ చేసారు. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందన్న ఆమె.. సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ వచ్చాక అనేక పనులు చేసుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి అని స్పష్టం చేసారు. సమాజంలో సగం జనాభా బీసీలు ఉన్నారన్నారు కవిత.

Also Read : భారత్ మోసం చేస్తుంది.. అమెరికా అధికారి సంచలన కామెంట్స్

కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారని గుర్తు చేసారు. సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించారని, జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై పెట్టిందన్నారు. ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి అని కవిత డిమాండ్ చేసారు. ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దామని.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం,గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశామని, ఆంధ్రా వాళ్ళ కంటే మీరు పాపం అయ్యారా…? అని నిలదీశారు. తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు అని ఎద్దేవా చేసారు. తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం అని ప్రశ్నించారు.

Also Read : ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే..?

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత, బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలన్నారు. రెండు ఏళ్లనుంచి ఊర్లల్లో సర్పంచులు,ఎంపీటీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు. బీసీలకు హక్కులు వచ్చాకే స్థానికసంస్థల ఎన్నికలు జరపాలి అని స్పష్టం చేసారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులో 9 సంవత్సరాలు స్థానికసంస్థల ఎన్నికలు జరగలేదన్నారు. తమిళనాడు పట్టుపట్టడంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని వ్యాఖ్యానించారు. 72 గంటలు పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తీసుకువెళ్లి పోలీసు స్టేషన్ లో పెట్టినా,హాస్పిటల్ లో పెట్టినా,ఇంటి దగ్గర పెట్టినా అక్కడే దీక్ష చేస్తాను అని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్