నాలుగేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్లో.. ఒకటి ఢిల్లీ మద్యం కుంభకోణం. ఆ రాష్ట్ర సిఎంగా పని చేసిన అరవింద్ కేజ్రివాల్ మద్యం కేసులో నిందితుడు అంటూ ఆయనను జైలుకు కూడా తరలించడం అప్పట్లో సంచలనం అయింది. ఈ కేసులో తాజాగా కోర్ట్ తీర్పు వెల్లడించింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు కొత్త విధానాన్ని రూపొందించడంలో.. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల కేసులో ఢిల్లీ కోర్టు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది.
Also Read : సెన్సార్ బోర్డుకు మైండ్ లేదా..? హైకోర్ట్ సంచలన కామెంట్స్..!
ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదు అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో సిసోడియా, కేజ్రివాల్ ఇద్దరూ జైలుకి వెళ్లివచ్చారు. 2021-22లో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై నమోదు చేసిన కేసు. ఆ పాలసీని ఢిల్లీ కోర్ట్ రద్దు చేసింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రివాల్ హర్షం వ్యక్తం చేసారు. మద్యం కుంభకోణంలో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో, అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను నిర్దోషినని, తనను ఇరికించడానికి బిజెపి కుట్ర పన్నిందని ఆరోపించారు.
Also Read : నా భర్తను పరిచయం చేస్తున్నా: రష్మిక
ఆప్ నేతల ప్రతిష్టను దెబ్బతీసేందుకు బిజెపి రాజకీయ కుట్రకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఇక ఈ కేసు నుంచి తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా బయటపడ్డారు. ఆమెతో పాటుగా మరో 23 మందికి సిబిఐ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కోర్ట్ కొట్టేసింది. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని కోర్ట్ స్పష్టం చేసింది.

