Tuesday, October 28, 2025 07:04 AM
Tuesday, October 28, 2025 07:04 AM
roots

కవితకు స్వాతంత్య్రం ఎప్పుడో?

కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేది ఎప్పుడు…? ఆమె హైదరాబాద్ లో తిరిగి అడుగు పెట్టేది ఎప్పుడు…? దీనికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. కెసిఆర్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే కవితకు బెయిల్ రావడం మాత్రం చాలా కష్టంగా కనపడుతున్న అంశం. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు వాతావరణం అంతగా సహకరించడం లేదు. గతంలో బిజెపికి అన్ని విధాలుగా సహకరించినా ఇప్పుడు బిజెపి మాత్రం తమకు సహకరించడం లేదు అనే ఆవేదన కెసిఆర్ లో ఉంది.

ఈ తరుణంలో కవిత బెయిల్ అంశం ఆసక్తికరంగా మారింది. తాజాగా సుప్రీం కోర్ట్ గడప తొక్కినా అక్కడ కూడా దర్యాప్తు సంస్థలు ప్రముఖ లాయర్లతో బలంగా వాదనలు వినిపించాయి. ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వారు వాదించారు. ఇక ఈ కేసు విచారణను 20 తర్వాత వాయిదా వేసింది సుప్రీం కోర్ట్. ఈ లోపు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది. పార్టీని విలీనం చేసే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారని అంటున్నారు. ఇందుకోసం పార్టీ కీలక నేతలను కూడా ఆయన ఒప్పించారని సమాచారం.

కవిత అప్రూవర్ గా మారితే తప్పించి ఆమెకు బెయిల్ రావడం సాధ్యం కావడం లేదు. పార్టీని విలీనం చేసినా సరే… కవిత అప్రూవర్ గా మారి కేజ్రివాల్ పేరు చెప్తే మినహా ఆమె బయటకు వచ్చే పరిస్థితి లేదని అర్ధమవుతోంది. అయితే కవిత అందుకు అంగీకరించడం లేదని సమాచారం. దీనిపై కేటిఆర్, హరీష్ రావు ఇద్దరూ కవితను ఒప్పించాలని ప్రయత్నం చేసినా ఆమె అంగీకరించడం లేదు. ఇక రౌస్ అవెన్యూ కోర్ట్ కవితకు కేజ్రివాల్ కు వచ్చే నెల 2 వరకు రిమాండ్ పొడిగించింది. దీనితో కవితకు బెయిల్ రావడం అనేది ఇప్పట్లో కనపడటం లేదు.

ఇక కవితకు బెయిల్ రాకుండా వాదించడానికి దర్యాప్తు సంస్థల వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు నియమించుకున్న లాయర్లు సైతం శక్తివంతం కావడం కవితకు పెద్ద సమస్యగా మారింది. కోర్టులో వారు లేవనెత్తుతున్న అంశాలపై కవిత తరుపు లాయర్లు బలమైన వాదనలు వినిపించలేకపోతున్నారు అనే అభిప్రాయం కూడా వినపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో మానిష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్