Friday, October 24, 2025 12:40 PM
Friday, October 24, 2025 12:40 PM
roots

కంపెనీ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చి.. కన్నీరు పెట్టిస్తున్న గోళ్ళ రమేష్ కుటుంబ విషాదం..!

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. 41 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరిన వీ కావేరి బస్ ట్రావెల్స్ బస్.. కర్నూలు నగరం సమీపంలోని చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్లి బైక్ ను ఢీకొనడంతో బైక్ బస్ కిందకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత పెట్రోల్ ట్యాంక్ పేలిపోవడం, ఆ వెంటనే బస్ డీజిల్ ట్యాంక్ లీక్ అయి మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Also Read : కోహ్లీ రిటైర్ కావడం ఖాయమా..? ఆ సిగ్నల్ ఎందుకు..?

ఇక ఈ ఘటనలో నెల్లూరు జిల్లా, వింజమూరు మండలం, గొల్లపాలెం గ్రామానికి గోళ్ళ రమేష్, అనూష దంపతులు ఈ ఘటలో ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులోని హిందుస్తాన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న రమేష్ కు దీపావళి సందర్భంగా.. కంపెనీ ట్రిప్ ఇవ్వడంతో.. కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళారు. సెలవలు అయిపోవడంతో తిరిగి బెంగళూరు వెళ్ళే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : టీడీపీలో వారికి గ్యారంటీ లేదా..?

కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలు మీడియాకు అందాయి. ఇక ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మొత్తం 13 మంది మృతదేహాలకు డీయెన్ఏ పరిక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు పోలీసులు. ఇక ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సిఎం చంద్రబాబు, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి సహా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

పోల్స్