Tuesday, October 28, 2025 05:43 AM
Tuesday, October 28, 2025 05:43 AM
roots

కడప బీనామీలే కేసిరెడ్డి బలం..? విచారణలో సంచలనాలు..?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో దర్యాప్తు బృందాలు కీలక అంశాలను రాబడుతున్నాయి. ఈ విషయంలో న్యాయస్థానాలు కూడా పూర్తిగా సహకరించడంతో దర్యాప్తు వేగవంతం అవుతుంది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలో ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి పలు కీలక అంశాలను దర్యాప్తు బృందం రాబట్టింది. మద్యం కుంభకోణంలో 2019 నుంచి 2024 వరకు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. పెద్దలకు ముడుపులు అందించడంలో ఆయనదే అత్యంత కీలక పాత్ర.

Also Read : టీడీపీలో నం.3 ఎవరో తెలుసా..?

విచారణలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాను నిధులు ఇచ్చినట్లుగా కూడా ఆయన అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తో పాటుగా ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్టు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పోలీసులకు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో ఏ విధంగా అక్రమాలు చేశారనే దానిపై స్పష్టమైన ఆధారాలను గుర్తించారు.

Also Read : అమరావతిపై ద్వేషం.. వైసీపీని మించిన బీఆర్ఎస్

సోమవారం కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, చాణక్యను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఈ సందర్భంగా చాలా సంస్థలను బినామీల పేరుతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నడిపించినట్లు గుర్తించారు. కొన్నిటి బాధ్యతలను చాణక్యకు మరికొన్ని బాధ్యతలను దిలీప్ కు అప్పగించారు. కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్యలను విడతల వారీగా ప్రశ్నించారు అధికారులు. ఈనెల 8వ తేదీ లోపు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో మరిన్ని వివరాలను రాబట్టాలని భావిస్తుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. బినామీలలో ఎక్కువగా కడప జిల్లాకు చెందిన వారే ఉన్నట్లుగా గుర్తించారు. మద్యం నగదును కడప జిల్లా నుంచి బెంగళూరు మీదుగా విదేశాలకు తరలించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్