ఇండియన్ సిలికాన్ సిటీ బెంగళూరుకు ఐటీ సంస్థలు వరుస షాకులు ఇస్తున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ కారణంగా ఐటీ సంస్థలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఈ ట్రాఫిక్ బాధలు మా వల్ల కాదు బాబోయ్.. అంటున్నాయి. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు ట్రాఫిక్‌లో నానా పాట్లు పడుతున్నారని.. దీని వల్ల పనిపైన ప్రభావం పడుతుందని ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో బెంగళూరులో రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. ఇలాంటి రోడ్లు నరకానికి మార్గాలు అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఇతర రాష్ట్రాలు ఆయా సంస్థలను తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
Also Read : ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్..? బయటకు రాని టీటీడీపీ నాయకులు
బెంగళూరు అంటే ఐటీ సంస్థలు బాబోయ్ అంటున్నాయి. దీనికి ప్రధానంగా ట్రాఫిక్‌ను చూపిస్తున్నాయి. దీంతో తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య సర్కార్ భావిస్తోంది. ఈ బాధ్యతలను ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అప్పగించారు. దీంతో అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు శివకుమార్. ఐటీ సంస్థల నుంచి వస్తున్న ఫిర్యాదులపై డీకే సమీక్ష నిర్వహించారు. దీనికి ఎలాంటి పరిష్కారం కావాలనే అంశాన్ని కూడా ఐటీ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. అధికారులు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఇందుకు ప్రధానంగా ఒకే ఒక్క పరిష్కార మార్గం అని ప్రభుత్వానికి సూచించారు. బెంగళూరు నగరానికి పీఆర్ఆర్ నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఆఘమేఘాల మీద కర్ణాటక ప్రభుత్వం పీఆర్ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read : కమ్మ, కాపు గొడవలకు ప్లాన్.. ఫేక్ అకౌంట్స్ తో పోస్టులు..!
బెంగళూరు బిజినెస్ కారిడార్‌గా 117 కిలోమీటర్ల పొడవైన ఫెరిఫెరల్ రింగ్ రోడ్డ ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టును బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఈ ప్రాజక్టును రెండేళ్లల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల కుటుంబాలు ప్రభావితం అవుతాయని అంచనా వేశారు. పీఆర్ఆర్ నిర్మాణానికి భూ పరిహార చెల్లింపుతో కలిపి రూ.27 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే భూ యజమానులు పరిహారం నగదు రూపంలో కాకుండా భూమి రూపంలోనే ఇవ్వాలని కోరారు. దీంతో పీఆర్ఆర్ ఖర్చు రూ.10 వేల కోట్లకే పరిమితం అవుతుందని అధికారులు వెల్లడించారు. బిజినెస్ కారిడార్ అందుబాటులోకి వస్తే బెంగళూరు ట్రాఫిక్ 40 శాతం తగ్గుతుందని తెలిపారు. బెంగళూరు బిజినెస్ కారిడార్ నిర్మాణం ట్రాఫికి కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు ఆర్థికి వ్యవస్థకు కూడా చేయూత ఇస్తుందని డీకే శివకుమార్ ప్రకటించారు.