Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

కడప నేతలు ఎక్కడ..? జగన్ కు దూరమా..? కూటమి అంటే భయమా..?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అత్యంత బలమైన జిల్లాల్లో రాయలసీమ జిల్లాలు నాలుగు ఉంటాయి. అనంతపురం జిల్లా పక్కన పెడితే మిగిలిన మూడు జిల్లాల్లో జగన్ కు మద్దతు ఎక్కువ. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఆ మూడు జిల్లాలు ఏదో ఒక రూపంలో జగన్ కు అండగా నిలుస్తూనే ఉంటాయి. అయితే 2024 ఎన్నికల తర్వాత మాత్రం ఈ మూడు జిల్లాలు సైలెంట్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా కడప జిల్లా సైలెంట్ గా ఉండటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది.

Also Read : సానుభూతి కోసం జగన్ నయా స్కెచ్

ఆ పార్టీలో కీలక నేతలు అలాగే జగన్ కు మద్దతు ఇచ్చే నాయకులు కడప జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు. వారెవరు కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయటం లేదు. ప్రస్తుతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నా అవి పెద్దగా సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం లేదు. ఇక మిగిలిన.. దూకుడుగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయటం లేదు.

Also Read : అమెరికా ‘డ్రాప్ బాక్స్’ వీసా నిబంధనలు మరింత కఠినం

శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటి వారు సైలెంట్ గానే ఉండిపోతున్నారు. అలాగే రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటానికి పలుమార్లు అధినేత వైయస్ జగన్ పిలిపిచ్చినా సరే జిల్లా నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. అసలు శ్రీకాంత్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే సాహసం చేయలేదు.

Also Read : ఎందుకీ మౌనం..? కొడాలి నానీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త రెచ్చిపోయిన రాచమల్లు శివప్రసాదరెడ్డి అయితే అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. ఇక కడప మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంజాద్ భాష కూడా అడ్రస్ లేరు. ఇక వైయస్ జగన్ అప్పుడప్పుడు మీడియా ముందు కనపడుతున్నా.. ఆయన పెద్దగా ప్రజల్లో పోరాటం చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీనితో కడప జిల్లా నాయకత్వం మొత్తం ప్రస్తుతం సైలెంట్ గానే ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు, కర్నూలు జిల్లాల నుంచి కూడా పెద్దగా నాయకులు ఎవరూ బయటకి రావడం లేదు. ఆర్కే రోజా అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఆమె మాటలకు మీడియాలో కూడా ప్రాధాన్యత ఉండటం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్