Friday, September 12, 2025 11:24 PM
Friday, September 12, 2025 11:24 PM
roots

టీడీపీలో జోగి మంటలు.. ఇప్పట్లో చల్లారేనా..?

తెలుగుదేశం పార్టీలో జోగి రమేశ్ మంటలు ఇప్పట్లో చల్లారేవా లేవు. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణతో పాటు వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా పాల్గొన్నారు. అదే వేదికపై మరికొందరు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంపై టీడీపీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేశ్ దాడికి యత్నించారు. అలాగే పవన్ కల్యాణ్‌పై ఓ బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో జోగిపై టీడీపీ, జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు.

Also Read : బ్రేకింగ్: కేటిఆర్ కు షాక్.. కేసు ఫైల్ చేసిన ఏసీబీ

అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జోగి రమేశ్‌తో వేదిక ఎలా పంచుకున్నారంటూ మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషను పార్టీ పెద్దలు ప్రశ్నించారు కూడా. దీంతో ఈ ఇద్దరు నేతలు బహిరంగంగానే క్షమాపణలు చెప్పడంతో పాటు చంద్రబాబు, లోకేశ్‌ను స్వయంగా కలిసి వివరణ కూడా ఇచ్చుకున్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని హామీ ఇచ్చారు. అసలు జోగి వస్తున్నట్లు మాకు తెలియదు.. అలా ముందే తెలిసి ఉంటే.. ఆ వేడుకకు దూరంగా ఉండేవాళ్లమని కూడా వెల్లడించారు. ఇదే విషయంపై కార్యక్రమ నిర్వాహకులు కొనకళ్ల నారాయణ చుట్టూ కూడా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన కూడా తప్పైంది అంటూ క్షమాపణలు చెప్పేశారు.

Also Read : సీతారామాంజనేయులును ఎందుకు అరెస్ట్ చేయలేదు..? హైకోర్ట్ సీరియస్

అయితే ఇప్పుడు ఇదే జోగి రమేష్‌కు సంబంధించి మరో వ్యవహారం వెలుగులోకి తీశారు కొందరు టీడీపీ నేతలు. ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనందుకే మంత్రి, ఎమ్మెల్యే, ఛైర్మన్‌ను తప్పుబట్టారు కదా… మరి ఏకంగా జోగి రమేశ్‌కు సన్మానం చేసిన టీడీపీ ప్రజాప్రతినిధులను ఏం చేస్తారంటూ నిలదీస్తున్నారు. ఈ ఏడాది కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా కుల సంఘం నేతలు జోగి రమేశ్‌ను ఘనంగా సన్మానించారు. అలా సన్మానం చేసిన వారిలో మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్.. ముడా ఛైర్మన్ మట్టా ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల బుల్లయ్య ఉన్నారు. వీరంతా కలిసున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి వీళ్ల నుంచి వివరణ తీసుకుంటారా… క్షమాపణ చెప్పిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు హోరెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్