ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ నకిలీ మద్యం తయారీ అంశం. ఈ కేసులో ఇప్పటికే ఏ1 ముద్దాయి అద్దేపల్లి జనార్థన్ రావును ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇదే సమయంలో జనార్థన్ రావు రిలీజ్ చేసిన వీడియో, మాజీ మంత్రి జోగి రమేష్‌తో వాట్సప్ చాటింగ్ జరిగిందంటూ ఒక ఫోటో బయటకు రావడం పెద్ద దుమారం రేపుతోంది. నకిలీ మద్యం తయారీ, కల్తీ మద్యం సరఫరా వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో వీడియోలు, ఫోటోలు కూడా ప్రదర్శించి మరీ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read : విశాఖను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసిన తండ్రి కొడుకులు
లేని లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ నేతలను అరెస్టులు చేస్తున్నారని.. కానీ ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేస్తుంది టీడీపీ నేతలే అని బయటకు వస్తే.. ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. నకిలీ మద్యం తయారీ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారని ఆరోపిస్తూ జనార్థన్ రావు వీడియో బయటకు రావడంతో.. వైసీపీ నేతలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక ఆ తర్వాత వాట్సప్ చాటింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇప్పుడు ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు కనీసం నోరెత్తడం లేదు. నారా వారి సారా అంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు.. సైలెంట్ అయ్యారు. ఈ వ్యవహారంలో జోగి రమేష్‍కు దూరంగా ఉంటే బెటర్ అని కూడా సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ లెక్కలు బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ..!
దీంతో తాను ఒంటరి అయినట్లు భావించిన జోగి రమేష్.. ఈ కేసు నుంచి బయటపడేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ముందు జనార్థన్ ఎవరో తెలియదన్నారు.. తర్వాత మా వీధిలోనే ఉంటారు.. చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. ఆ తర్వాత నన్ను ఎంతో మంది కలుస్తుంటారు.. అందులో జనార్థన్ కూడా ఒకరంటూ మాట మార్చారు. తాజాగా మరో వాదనను తెరపైకి తీసుకువచ్చారు జోగి రమేష్. తానో బీసీ వర్గానికి చెందిన వాడినని.. గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చిన కుటుంబం అని.. అతి సామాన్యుడిని అని వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ పైకి వస్తుంటే.. ఎందుకు ఇంత కక్ష అంటూ వింత వాదన తెరపైకి తీసుకువచ్చారు. కేవలం నాడు చంద్రబాబు ఇంటి ఎదుట ఆందోళన చేసేందుకు వెళ్లినందుకే.. తనపై కక్షతో వేధిస్తున్నారన్న జోగి రమేష్.. ఓ సామాన్యుడి కోసం ఇంత కుట్ర అవసరమా అంటూ బేల పలుకులు పలుకుతున్నారు.
Also Read : జోగిని సస్పెండ్ చేస్తారా..? వివాదాల ఆప్తుడు..!
ఒక బీసీ పైన, జోగి రమేష్ అనే అల్పుడి పైన సీఎం స్థాయి చంద్రబాబు కక్ష కట్టారన్నారు. ఈ విషయంలో ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు రెడీ అన్నారు. అయితే జోగి వ్యాఖ్యలపై టీడీపీ బీసీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెరుకుపల్లిలో అమర్‌నాథ్ గౌడ్ అనే యువకుడిని వైసీపీ నేతలు సజీవ దహనం చేస్తే.. ఆ కుటుంబం ఆందోళన చేస్తున్నప్పుడు.. ప్రతి విషయంలో బీసీ అనే పదం ఎందుకు అని నాడు మంత్రి హోదాలో ఉన్న జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పైన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్ మెప్పు కోసం చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. నువ్వెంత.. నీ స్థాయి ఎంత అంటూ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న టీడీపీ నేతలు.. తప్పు చేసిన తర్వాత ఇలా కులం కార్డు తీయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.